“జగనన్న గోరుముద్ద"లో మరో పోషకాహారం..
21 Mar, 2023 10:11 IST
తాడేపల్లి: బడికి వెళ్తున్న పిల్లలకు కనీసం పౌష్టికాహారం అందించాలని గతపాలకులు ఆలోచించలేదు. ఎదిగే చిన్నారులకు అది ఎంత అవసరమో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచించి జగనన్న గోరుముద్ద పేరుతో రుచికరంగా రోజుకో మెనూ తీసుకొచ్చారు. చిన్నారులను మరింత ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు అదనంగా రాగి జావ అందిస్తున్నారు. నేటి నుంచి బడి పిల్లలకు ఉదయం పూట రాగి జావ ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని 37,63,698 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ ఏటా రూ. 86 కోట్ల అదనపు వ్యయంతో రాగిజావ అందించే కార్యక్రమాన్ని నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.