సీఎం వైయస్ జగన్‌తో శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ వెంకటేశ్వరన్ భేటీ
26 Jul, 2021 17:26 IST
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిని శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్.డి.వెంకటేశ్వరన్ కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వెంకటేశ్వరన్ సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్.డి.వెంకటేశ్వరన్‌ను సీఎం వైయస్ జగన్ శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేశారు.