శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి బ్రహ్మైక్యం

13 Feb, 2026 14:08 IST

తాడేప‌ల్లి: తూర్పుగోదావరి జిల్లా తునిలోని తపోవనం మఠం మఠాధిపతులు, ప్రముఖ ఆధ్యాత్మిక మార్గదర్శకులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి బ్రహ్మైక్యం చెందడంపై వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సంతాప సందేశాన్ని విడుదల చేస్తూ, స్వామి వారి పరమపదించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. స్వామి వారి మరణవార్త ఆధ్యాత్మిక వర్గాల్లోనే కాకుండా అన్ని వర్గాల ప్రజలను తీవ్ర విషాదంలో ముంచేసిందన్నారు.

స్వామి వారు జీవితాంతం ధర్మప్రచారం, వేద సంస్కృతి పరిరక్షణ, సేవా కార్యక్రమాలకు అంకితభావంతో పనిచేశారని వైయ‌స్ జగన్ తెలిపారు. తపోవనం మఠాన్ని ఆధ్యాత్మిక సాధనకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడంలో వారు విశేష కృషి చేశారని కొనియాడారు. వేలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక చైతన్యం కలిగించి, సద్గుణాల మార్గంలో నడిపించిన మహానుభావులని ఆయన పేర్కొన్నారు.

సనాతన ధర్మం, సత్యం, సేవ, సమానత్వం వంటి విలువలను స్వామి వారి బోధనలు ప్రతిబింబించాయని వైయ‌స్ జగన్ అన్నారు. సమాజంలోని బలహీన వర్గాల పట్ల వారు చూపిన కరుణ, సేవా కార్యక్రమాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

స్వామి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి భక్తులకు మరియు మఠ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. స్వామి వారి ఆశయాలు, ఆధ్యాత్మిక బోధనలు ఎల్లప్పుడూ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని జగన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.