అమ్మవారి ఆలయ శతజయంతి ఉత్సవాలకు రండి
16 Jun, 2022 17:06 IST
తాడేపల్లి: శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుంటూరులోని ఆర్.అగ్రహారం శ్రీకన్యకాపరమేశ్వరి దేవస్థాన శతజయంతి ఉత్సవాలకు సీఎం వైయస్ జగన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ నెల 20 నుంచి 24 వరకు శత జయంతి మహోత్సవాలు జరుగనున్నాయి. ఆహ్వానపత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేసిన వారిలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు మద్దాళి గిరిధర రావు (గిరి), ఆలయ కమిటీ చైర్మన్ దేవరశెట్టి సత్యనారాయణ, సభ్యులు పాల్గొన్నారు.