వైయస్ఆర్, వైయస్ జగన్‌ల తోనే సగర కులానికి గుర్తింపు
తాడేపల్లి: సగర కులస్తులంటే వైయస్ జగన్ గారికి ఎంతో ప్రేమ అని, సంక్షేమ పథకాల అమలులో వైయస్ జగన్ గారు భగీరథ మహర్షిలా పట్టుదలతో పనిచేశారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తండ్రీకొడుకులు వైయస్సార్, వైయస్ జగన్ లే భగీరథ సగర కులస్తులను గుర్తించి రాజకీయంగా ప్రోత్సహించారని సగర కుల నాయకులు గుర్తు చేసుకున్నారు. దివంగత వైయస్సార్ గారు సగర కులానికి చెందిన తాడిశెట్టి వెంకట్రావుకి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే, వైయస్ జగన్ గారు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌గా కర్నాటి రాంబాబును నియమించారని చెప్పారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ భగీరథ జయంతిని ఘనంగా నిర్వహించారు. భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గంగను భూమి మీదకు తెచ్చేందుకు ఒంటి కాలిమీద కఠోర తపస్సు చేసి సకల మానవాళి మనుగడకు కారణమైన భగీరథ మహర్షిలో ఉన్న ఓర్పు, పట్టుదల, తెగింపు వైయస్ జగన్ లోనూ చూశామని కొనియాడారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారని నాయకులు ప్రశంసించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక సగరులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని మండిపడ్డారు. సగరులను ప్రోత్సహించిన వైయస్ జగన్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.
ఈ భగీరథ మహర్షి జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్, దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు, పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, నారాయణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
● వైయస్ జగన్ గారికి సగరులంటే ఎంతో ప్రేమ
- లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ
గంగను భూమి మీదకు తీసుకురావడం కోసం ఒంటి కాలి మీద శ్రీ భగీరథ మహర్షి కఠోర తపస్సు చేశారు. ఆ విధంగా ఆ మహానుభావుడు సకల జీవరాశుల మనుగడకు ఆయన కారణ భూతులయ్యారు. పట్టుదల, ఓర్పు, తెగింపును ఆయన్ను చూసే నేర్చుకోవాలి. అలాంటి మహనీయుడి జయంతిని జరుపుకోవడం మన అదృష్టం. వైయస్ జగన్ గారు సగర కులస్తులను రాజకీయంగా ప్రోత్సహించారు. రాష్ట్రంలో తిరుమల తిరుపతి తర్వాత అత్యంత ప్రసిద్ధి చెందిన దుర్గమ్మ ఆలయానికి చైర్మన్‌గా సగర కులానికి చెందిన కర్నాటి రాంబాబుని నియమించడం ఆ కులం పట్ల ఆయనకున్న ప్రేమను సూచిస్తోంది.
- సగరులను ప్రోత్సహించింది వైయస్సార్, జగన్‌లే
శ్రీ భగీరథ మహర్షి జయంతి కార్యక్రమాన్ని వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతోంది. సకల కోటి జీవరాసుల మనుగడకు కావాల్సిన గంగను భూమి మీదకు తీసుకురావడానికి ఒంటి కాలి మీద భగీరథ మహర్షి కఠోర తపస్సు చేశారు. ఆయన చూపించిన తెగువ, పట్టుదలనే మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు తన ఐదేళ్ల పాలనలో సంక్షేమ పథకాల అమలులో కొనసాగించారు. దివంగత వైయస్సార్, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ లు రాష్ట్ర చరిత్రలో సగర భగీరథులకు గుర్తింపునిచ్చి రాజకీయంగా ప్రోత్సహించారు. దివంగత వైయస్సార్ గారు సగర కులానికి చెందిన తాటిశెట్టి వెంకట్రావుకి గుంటూరు నుంచి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. వైయస్ జగన్ గారు సీఎం అయ్యాక సగర కులానికి చెందిన నాకు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్‌గా అవకాశం కల్పించి ప్రోత్సహించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కనీసం బోర్డు మెంబర్‌గా కూడా సగర కులస్తులకు అవకాశం ఇవ్వలేదు. సగర కులస్తులను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాడు.