నిజం తేలింది..విష ప్రచారం వీడింది!

31 Jan, 2026 11:22 IST

గుంటూరు: తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సిట్ (సీబీఐ) సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించడంతో నిజం బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో గుంటూరు నగరంలోని పాత గుంటూరు ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, పట్టణ అధ్యక్షురాలు  షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయలు కొట్టి తన భక్తిని చాటుకున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం కావాలనే చేసిన అసత్య ప్రచారాలను ఆమె తీవ్రంగా ఖండించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జరిగిన దుష్ప్రచారాలు పూర్తిగా అబద్ధమని తేలిందని, ఇకనైనా ఇలాంటి ప్రచారాలకు స్వస్తి పలకాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ పోలవరపు జ్యోతి వెంకటేశ్వరరావు, 11వ డివిజన్ కార్పొరేటర్ ఆబిద్‌, డివిజన్ నాయకులు సదం కోటేశ్వరరావు, అల్లం కోటేశ్వరరావు, మాదాసు మాధవరావు, రాంబాబు, వెంకటేశ్వరరావు, మహేష్‌, చన్నం శివయ్య, బుల్లోడు, శ్యామ్‌, పాల్‌, చంద్రారెడ్డి, అంజిరెడ్డి పాల్గొన్నారు. అలాగే జిల్లా వైస్‌ ప్రెసిడెంట్ నందెటి రాజేష్‌, జిల్లా వాలంటీర్ విభాగం వైస్‌ ప్రెసిడెంట్ స్వర్ణలత, జిల్లా అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలు రమణి, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి సుబులు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఉషారాణి, నగర ప్రచార కమిటీ అధ్యక్షుడు యాదల చిన, నగర యువజన విభాగం వైస్‌ ప్రెసిడెంట్ రబ్బానీ, జిల్లా యువజన విభాగం సెక్రటరీ ఉమర్ ఫరూక్‌, డివిజన్ అధ్యక్షులు కోట సత్యం, శివన్నారాయణ, పల్లా శ్రీను, లియాఖత్‌, శ్రీకాంత్ రెడ్డి సహా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.