చట్టసభ గౌరవాన్ని ఇనుమడింపచేయాలి

3 Jul, 2019 12:20 IST

అమరావతిః స‌భా నిబంధనలు, ప్రొసిజర్స్,సభా వ్యవహారాలపై సభ్యులు అవగాహన పెంచుకోవాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు.రెండు రోజులు పాటు జరగనున్న  ఏపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. సభా సమయాన్ని వృధా చేయవద్దని సూచించారు.ఏడాదికి సుమారు 150 కోట్ల ఖర్చుపెడుతున్నామన్నారు.ఒక  రోజుకు ఆరు లక్షలు ఖర్చుపెడుతున్నామన్నారు.సభ క్రమశిక్షణగా జరగాలంటే చాలా నేర్చుకోవాలన్నారు.రెండు రోజులు పాటు నిష్ణాతులు  శిక్షణ ఇస్తారని తెలిపారు. శాసన సభ నిర్వహణ విజయవంతం అయ్యేవిధంగా సభ్యులు వ్యవహరించాలన్నారు. సభ నిర్వహణలో స్పష్టమైన అజెండా,నిబంధనలు ఉన్నాయన్నారు.

సభలో హుందాతనమే నియోజకవర్గాల్లో సభ్యులుకు గౌరవం పెంచుతుందన్నారు.సభ కాలాన్ని వినియోగించుకుని మంచి శాసనసభ్యులుగా పేరుతెచ్చుకోవాలన్నారు. ఈ శిక్షణ తరగతులు గొప్ప అవకాశమని తెలిపారు.ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి క్రమశిక్షణతో సభను నడిపించాలన్నారు.శాసన సభ సమావేశాలపై ప్రజలు చర్చించుకోవాలన్నారు.పూర్తి సమాచారంతో శాసనసభలో మాట్లాడాలని..శాసన సభ గౌరవాన్ని ఇనుమడింప చేయాలన్నారు.