సోషల్ మీడియా తిరుపతి మండల అధ్యక్షుడు చరణ్ తేజ అకాల మరణం
19 Feb, 2026 12:20 IST
తిరుపతి : తిరుపతి రూరల్ మండలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు చరణ్ తేజ అకాల మరణం పొందారు. విషయం తెలిసిన వెంటనే చెవిరెడ్డి కుటుంబ సభ్యులు చరణ్ తేజ ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి లక్ష్మీ, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. చరణ్ తేజ తన కుటుంబ సభ్యులలో ఒకరిగా పెరిగిన వ్యక్తి. ఆయనను చిన్న వయస్సులో మృత్యువు కబళించడం అత్యంత దురదృష్టకరమని, ఆయన మరణం తమకు, పార్టీకి, సమాజానికి తీరని లోటు అన్నారు. చరణ్ తేజ కుటుంబానికి అన్ని విధాలా తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులందరినీ ఓదార్చి ధైర్యం చెప్పారు.
-