సోషల్ మీడియా కన్వీనర్ గోపికి మేరుగ నాగార్జున పరామర్శ
22 Apr, 2025 14:14 IST
బాపట్ల: బల్లికురవ మండల వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ గోపి రాజు యాదవును బాపట్ల జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోపి రాజ్ యాదవ్ పై దాడి చేసిన టిడిపి కార్యకర్తలు పై కేసు నమోదు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. పోలీసులు టిడిపి నాయకులకు కొమ్ముకాస్తున్నారని ఫైర్ అయ్యారు. స్థానిక ఎస్సై నాగరాజు వ్యవహార శైలీపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎల్లకాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదు గుర్తుపెట్టుకోవాలని, చట్టాన్ని ఉల్లంఘించిన వారికి వక్కింతకు రెండింతలు వడ్డీతో చెల్లిస్తామని మేరుగ నాగార్జున హెచ్చరించారు.