వైయస్ జగన్‌ను కలిసిన సోషల్ మీడియా కార్యకర్త దొడ్డా రాజేష్
22 Apr, 2025 19:26 IST
తాడేపల్లి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన 20 అక్రమ కేసుల్లో భాగంగా 46 రోజుల పాటు జైల్లో ఉండి బెయిల్ పై విడుదలైన వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి దొడ్డా రాకేష్ గాంధీ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఇవాళ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి విడదల రజనీ వెంట వచ్చిన రాజేష్ వైయస్ జగన్‌ను కలిసి కూటమి ప్రభుత్వం తన పట్ల వ్యవహరించిన తీరును వివరించారు. ఈ సందర్భంగా రాజేష్‌కు వైయస్ జగన్ ధైర్యం చెప్పారు.