ఆరో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
19 Mar, 2023 09:10 IST
అసెంబ్లీ: ఆరో రోజు ఏపీ అసెంబ్లీ 2023-24 వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ మొదలులైంది. సభలో రైతు సంక్షేమంపై చర్చ జరుగుతుంది. రైతుల కోసం సీఎం వైయస్ జగన్ చేస్తున్న మేలు, ఆర్బీకే సేవలపై చర్చిస్తున్నారు. అదే విధంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, యువతకు స్కిల్ డెవలప్మెంట్పై చర్చ కొనసాగనుంది.