విశాఖలో కూటమి పార్టీలకు షాక్!
విశాఖ: విశాఖ నగరంలో కూటమి పార్టీలకు భారీ షాక్ తగిలింది. కూటమి పాలనపై విరక్తి చెందిన పలువురు ముస్లింలు వైయస్ఆర్‌సీపీ గూటికి చేరారు. దక్షిణ వైయస్ఆర్‌సీపీలోకి 30 వ వార్డుకు చెందిన పలువురు ముస్లింలు వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో పార్టీలోకి చేరారు. ఆ వార్డు అధ్యక్షుడు దశమంతల మాణిక్యాలరావు, ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు సంయుక్త ఆధ్వర్యంలో వారంతా వైయస్ఆర్‌సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ కండువా వేసి వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ముస్లింల చేరికతో దక్షిణ నియోజకవర్గ వైయస్సార్ సీపీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో సుపరిపాలన అందించడంలో పూర్తి వైఫల్యం చెందిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీని నూటికి నూరు శాతం అమలు చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సిపియే అని గుర్తు చేశారు. అణగారిన వర్గాలకు మైనార్టీ, క్రిస్టియన్, బీసీ కులాలకు, మహిళలకు జగన్మోహన్ రెడ్డి హయాంలో సముచిత స్థానం కల్పించారన్నారు. వైయస్ఆర్‌సీపీలో కి మరింతమంది దక్షిణ నియోజకవర్గం నుండి చేరే అవకాశం ఉందని వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 30వ వార్డ్ ప్రెసిడెంట్ దస్మాంతుల మాణిక్యలరావు, స్టేట్ ఆర్టీఐ సెక్రటరీ దస్మాంతుల వేణుగోపాల్, జిల్లా ఆర్‌టీఐ ప్రెసిడెంట్ వడ్డది దిలీప్,జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్,జిల్లా SC సెల్ వైస్ ప్రెసిడెంట్ కోన శంకర్, సౌత్ యూత్ ప్రెసిడెంట్ తాడి రవితేజ,సౌత్ స్టూడెంట్ సెల్ ప్రెసిడెంట్ వీటి కృష్ణ కుమార్,జిల్లా మహిళా జనరల్ సెక్రటరీ నీలపు లక్ష్మి, బాలు, వార్డ్ బీసీ సెల్ ప్రెసిడెంట్ వేణు,30వ వార్డు వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.