వైయ‌స్‌ జగన్‌ను కలిసిన వృద్ధురాలు శేషగిరమ్మ… 

2 Apr, 2026 18:41 IST

తాడేపల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైయ‌స్ జగన్‌ను గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నెల్లూరి శేషగిరమ్మ కలిశారు. అమరావతి రాజధాని కోసం భూముల సేకరణ సమయంలో తన భూమిని అక్రమంగా తీసుకున్నారని, సీఆర్‌డీఏ అధికారులు నష్టపరిహారం ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆమె కన్నీటిపర్యంతం అవుతూ వివరించారు.

తనకు న్యాయం చేయాలని రెవెన్యూ, సీఆర్‌డీఏ అధికారుల వద్ద ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోయిందని, ఎవరూ తన సమస్యను పట్టించుకోలేదని శేషగిరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వైయ‌స్ జగన్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఆమెకు ధైర్యం చెబుతూ న్యాయం జరిగేలా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా శేషగిరమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులు బ్రహ్మేంద్ర కుమార్, శ్రీనివాస్ కూడా వైయ‌స్ జగన్‌ను కలిసి తమ సమస్యను వివరించారు.