వైయస్ఆర్ సీపీ నుంచి శరగడం చిన్న అప్పలనాయుడు సస్పెండ్
7 Feb, 2023 19:36 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా, పెందుర్తి నియోజకవర్గానికి చెందిన శరగడం చిన్న అప్పలనాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా అందిన ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు శరగడం చిన్న అప్పలనాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధ్యక్షులు వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదలైంది.