20వ రోజు సామాజిక సాధికార యాత్ర షెడ్యూల్‌

24 Nov, 2023 11:00 IST

తాడేప‌ల్లి: గ‌డిచిన నాలుగున్నరేళ్ల పాల‌న‌లో ఆర్థికంగా, రాజ‌కీయంగా, సామాజికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌ చేసిన మంచిని వివరించడానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర నేడు నంద్యాల జిల్లాలో శ్రీశైలం, ఎన్టీఆర్‌ జిల్లాలో జగ్గయ్యపేట, పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ నియోజకవర్గాల్లో జరగ‌నుంది.

పార్వతీపురం మన్యం జిల్లా పాల‌కొండ‌లో..
వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో పాల‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో బస్సు యాత్ర కొన‌సాగనుంది. ఉదయం 10.30 గంటలకు చిన్న మంగళాపురంలో వైయ‌స్ఆర్ సీపీ నేతలు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హిస్తారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు మంగళాపురం గ్రామ సచివాలయం సందర్శిస్తారు.  సాయంత్రం 3.30 గంట‌ల‌కు పాలకొండ ప్రధాన సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వ‌హిస్తారు. 

ఎన్టీఆర్ జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌లో..
వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో సామాజిక సాధికార యాత్ర కొన‌సాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు శకుంతలమ్మ డిగ్రీ కళాశాలలో వైయ‌స్ఆర్ సీపీ నేతలు మీడియా స‌మావేశం నిర్వ‌హిస్తారు. అనంత‌రం శ‌కుంతలమ్మ కళాశాల నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 3:30 గంటలకు బలుపుపాడు నాలుగురోడ్ల కూడలిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, విడదల రజిని, మేరుగ నాగార్జున, ఎంపీలు ఆర్.కృష్ణయ్య, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నందిగం సురేష్ తదితరులు హాజరుకానున్నారు.

నంద్యాల జిల్లా శ్రీ‌శైలంలో..
వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరులో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆత్మకూరు మండలం నల్ల కాల్వ వద్ద వైయ‌స్ఆర్ స్మృతి వనంలో తటస్థులతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మీడియా ప్రతినిధులతో సమావేశం అనంతరం వైయ‌స్ఆర్‌ స్మృతివనం నుంచి ఆత్మకూరు వరుకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆత్మకూరు గౌడ్ సెంటర్‌లో బహిరంగ సభ జరగనుంది. మంత్రులు అంజాద్ భాషా, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, తదితరులు హాజరుకానున్నారు.