కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసు
2 Aug, 2021 20:15 IST
నెల్లూరు: కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసు అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దాదాగిరీ ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
సోమవారం నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలతో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలందరికీ ఇళ్లు’’ పథకం అమలుపై చర్చించారు. ఉప ఎన్నికల ఫలితాలపై బేరీజు వేసుకున్నామని సజ్జల తెలిపారు. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలను కూడా పొరుగు రాష్ట్రం పెడచెవిన పెట్టింది. జలవిద్యుత్ పేరుతో 30 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారు. ఎగువ ప్రాంతంలో ఉన్నామన్న భావనతో జల వివాదానికి దిగారు. ఆంధ్రా వాటా నీటిని కాపాడుకునేందుకు సీఎం వైయస్ జగన్ ప్రయత్నించారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.