రెఫరెండంకు రెడీనా అని చంద్రబాబు
18 Dec, 2020 10:49 IST
విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సవాలు విసిరారు. రెఫరెండంకు రెడీనా అని చంద్రబాబు అంటూ రామకృష్ణారెడ్డి ట్వీట్ చేశారు. తాను నమ్మిన అంశాల మీద నమ్మకం, విశ్వాసం ఉండే నాయకులు ఏంచేశారో ఉమ్మడి రాష్ట్రంలో చూశాం. కాంగ్రెస్ నుంచి వేరుపడ్డ సమయంలో వైయస్ జగన్‌గారు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌గారు ఏంచేశారో మనకు తెలిసిందే. వారి ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజలముందుకు వెళ్లారు. వైయస్ జగన్ గారు, కేసీఆర్‌గారిలానే చంద్రబాబుగారు కూడా తాను చెప్తున్న మాటలమీద ఆయనకు నమ్మకం ఉంటే ఇప్పుడు ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్తే, ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలుతుంది కదా? అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ట్వీట్ చేశారు.