వైయస్ఆర్ స్ఫూర్తిని సీఎం వైయస్ జగన్ మరింత ముందుకు తీసుకెళ్తున్నారు
8 Jul, 2020 11:33 IST
తాడేపల్లి: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తిని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరింత ముందుకు తీసుకెళ్తున్నారని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో వైయస్ఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇలాంటి రాజకీయ వారసత్వం దేశంలో ఎవరికీ లేదన్నారు.వైయస్ఆర్ హయాంలో రైతులకు అనేక సంక్షేమఫలాలు అందాయన్నారు. రైతులకు వైయస్ఆర్ వ్యవసాయం పండుగ చేశారన్నారు. వైయస్ఆర్ జయంతిని సీఎం వైయస్ జగన్ రైతు దినోత్సవంగా ప్రకటించారన్నారు. సీఎం వైయస్ జగన్ రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ సుపరిపాలన అందిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.