అమర్‌రాజా ఫ్యాక్టరీ ఏపీలో ఉంటే మాకెలాంటి అభ్యంతరం లేదు
4 Aug, 2021 14:26 IST
తిరుపతి: అమర్‌రాజా ఫ్యాక్టరీ ఏపీలో ఉంటే మాకెలాంటి అభ్యంతరం లేదని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. గాలి, నీటిని కలుషితం చేయకుండా పరిశ్రమను నడుపుకోవచ్చు అని తెలిపారు. విదేశీ కంపెనీలైనా, స్వదేశీ కంపెనీలైనా కాలుష్యం చేయకుండా ఉండాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిబంధనలు పాటించాలని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కరోనా ఛిన్నాభిన్నం చేసిందని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు.