సెలెక్ట్ కమిటీ ఏర్పాటే కాలేదు
4 Feb, 2020 15:14 IST
సచివాలయం: మండలి చైర్మన్ సూచించిన సెలెక్ట్ కమిటీ ఇప్పటిదాకా ఏర్పాటు కాలేదని, లేని కమిటీకి ఏవిధంగా ప్రతిపక్ష పార్టీలు పేర్లు ఇస్తాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. లేని సెలెక్ట్ కమిటీకి మేం పేర్లు పంపడమేంటని ఆయన ప్రశ్నించారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలంటే సభ్యుల అభిప్రాయం తీసుకోవాలి. ఓటింగ్ పెట్టాలి. సభలో టీడీపీ సభ్యులు ఎక్కువ ఉన్నారని, బిల్లులు అడ్డుకోవడం సరికాదు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలి. మండలి చైర్మన్ టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు. వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లులను శాశ్వతంగా అడ్డుకోలేరు.