వాలంటీర్లపై.. చంద్రబాబు కక్షకు పరాకాష్ఠ ఇది!.
తాడేపల్లి: వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష కట్టారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటింటికీ అందుతున్నాయన్నారు. వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
*ఈ చర్య చంద్రబాబుకు వాలంటీర్లపై కక్షకు పరాకాష్ఠ:*
– చంద్రబాబునాయుడు ఎన్నికలు దగ్గరకొచ్చి, ప్రజల తీర్పుకు వెళ్లే సమయంలో రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశంలో ఉత్సుకత చూపిస్తాడు.
– ఆయన పాలన ఉంటే ప్రజాజీవితం ఎంతగా విధ్వంసం చేస్తాడో, ప్రజలను ఎలా రాచిరంపాన పెడతాడో అందరికీ తెలుసు.
– ఈ ఎన్నికల సమయంలో మరో సారి అలాంటి ధోరణినే చూపించాడు.
– ఆయన కత్తికట్టిన వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శ ప్రాయంగా నిలిచింది.
– దీనిపై ఆయన మొదటి నుంచీ కత్తి కట్టి కక్షపెంచుకున్నాడు.
– దానికి పరాకాష్ఠగా పింఛన్లు పంపిణీని అడ్డుకునేందుకు నడుం బిగించాడు.
– పింఛన్ల పంపిణీ, ఇతర డీబీటీలు ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి ప్రారంభం అవుతాయి.
– వేకువజామునే అవ్వాతాతల వద్దకు వెళ్లి పింఛన్ ఇచ్చే విధానాన్ని ఎన్నికల కోడ్ పేరుతో పంపిణీ జరగకూడదు అని ఆపించారు.
– నాకేం తెలుసు ఎవరో పెట్టారని అంటున్నాడు. ఇలాంటి చెండాలపు పని నేరుగా చేస్తే ప్రజావ్యతిరేకత వస్తుందని తెలుసు.
– తనకు వెన్నతో పెట్టిన విద్యలా ఎవరినో ఒకరిని ముందు పెట్టి ఇలాంటి పనులు చేయిస్తున్నాడు.
– నిజంగా ఆయనకు వాలంటీర్ సిస్టమ్ వద్దని సైద్ధాంతికంగా అనుకుంటే తానే కోర్టుకు వెళ్లొచ్చు.
– మేము వస్తే దీన్ని తీసేస్తాం..జన్మభూమి కమిటీలను తీసుకొస్తాం అని చెప్పొచ్చు. ఆయనకు స్వేచ్ఛ ఉంది.
– అలా కాకుండా నిస్సహాయులను దొంగ దెబ్బతీశాడు. దానికి ఇప్పుడు బుకాయింపు ప్రారంభించాడు.
– వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడి అభిప్రాయాలేంటో అందరికీ తెలుసు.
– వీళ్లు అధికార పార్టీ కార్యకర్తలని ఓపెన్ గానే అంటున్నారు.
– వాలంటీర్లను మా పార్టీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్నారు.
– దానిపై కూడా మాట మాటకూ మాట మారుస్తున్నాడు. ఈ రోజు నేను జీతాలు కూడా పెంచుతాను అంటున్నాడు.
*సిటిజన్స్ ఫర్ డెమెక్రసీ అనే సంస్థ చంద్రబాబు బీ–టీమ్:*
– ఎందుకు ఇంత సందిగ్ధం? సిటిజన్స్ ఫర్ డెమెక్రసీ అనే ఒక సంస్థను పెట్టించి, దాని ద్వారా ఇలా చేయించి తనకు తెలియనట్లు మాట్లాడుతున్నాడు.
– ఈ వాలంటీర్లు వెళ్లి ప్రజలతో ఓట్లు వేయిస్తారనే భయంతోనే ఇదంతా చేశాడు.
– పిల్ల చేష్టల్లా..వాలంటీర్ వ్యవస్థ వల్ల వచ్చే లాభాలేంటి అనేది కూడా ఆలోచించే దార్శనికత ఆయనలో లేదు.
– ఏదో చేయబోతే చివరికి మరేదో అయ్యింది. వాలంటీర్ వ్యవస్థపై ఎక్కుపెట్టిన బాణం తిరిగి తనకే తగిలింది.
– దానికి డ్యామేజ్ కంట్రోల్ చేయాలని లేఖలు రాయడం మొదలు పెట్టాడు. కానీ ఆయన తప్పించుకోలేడు.
– సిటిజన్స్ ఫర్ డెమెక్రసీ అనేది సరిగ్గా ఎన్నికలకు ముందు పెట్టారు. వారి ఫిర్యాదు మేరకే మేం చర్యలు తీసుకున్నామని ఈసీ చెప్పింది.
– కోర్టులో ఈ సిటిజన్స్ ఫర్ డెమెక్రసీ వేసిన కేసు ఆధారంగానే మేం ఈ చర్యలు తీసుకున్నామని ఈసీ చెప్పింది.
– ఈ సంస్థ 23.09.2023 నాడు ఫాం అయింది. ఫాం అయిన పదిహేను రోజుల్లోనే వాలంటీర్ వ్యవస్థపై వారు సుప్రీం కోర్టుకు వెళ్లారు.
– వాలంటీర్ వ్యవస్థ సున్నితమైన డేటాను కలెక్ట్ చేస్తోంది, అది అధికార పార్టీకి అందిస్తోందని కేసు వేశారు.
– ఈ కేసు వేసిన వారిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముఖ్యుడు. ఆయన ఎవరనేది గత స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా తెలిసింది.
– టీడీపీ ఆఫీసు నుంచే పనిచేస్తున్నారనే ఆరోపణలు, అక్కడి నుంచి వచ్చిన డైరెక్షన్స్‌తో పనిచేశాడని ఆ ఎన్నికల్లో ఆరోపణలు వచ్చాయి.
– చంద్రబాబు ఏజెంట్లతో బీజేపీలో ఉన్న వారితో కలిసి తిరిగినవి కూడా బయటకు వచ్చాయి.
– పూర్తి ఫక్తు టీడీపీ కార్యకర్తలా నిమ్మగడ్డ రమేష్ పనిచేశాడు. అలాంటి మరో ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో కలిపి ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
– ఈ కేసులో వాదించేందుకు కపిల్ సిబాల్ అనే లాయర్‌ను పెట్టుకున్నారు. ఆయన కేసు వాదించాలంటే కోట్లలో ఉంటుంది.
– ఎంత ఆస్తులు ఉంటే మాత్రం వీరు అంత ఖర్చు చేయగలరా?
– అంత అర్జంటుగా డెమోక్రసీపై ప్రేమ పుట్టి..అంత ఖర్చు వీళ్లు పెట్టగలరా?
*పొరపాటున చంద్రబాబు వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడే చూపించాడు:*
– వారి ముఖ్య ఉద్దేశం, ఫోకస్ వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీయాలనేదే.
– వీళ్లు చంద్రబాబు తరఫునే పనిచేస్తున్నారనేదే దేశమంతా తెలుసు.
– ఈ వ్యవస్థను దెబ్బతీయాలనే చంద్రబాబు ఉద్దేశం, ఆ చెడ్డ పేరు తనమీదకు రాకూడదనే ఈ సంస్థతో చేయించాడు.
– గత నాలుగేన్నరేళ్లుగా తమ మనుమడు జగన్ ఇస్తున్న పింఛన్ తీసుకుంటున్న వృద్ధులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు.
– దాన్ని ఒక్క సారిగా లింక్ కట్ చేయించారు. ఇది ఒక్క రోజు ఇబ్బంది అనేది ఒకటైతే..ఆయనొస్తే రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో ఆర్ధం చేసుకోవాలి.
– ఇప్పటికీ 2014–19 మధ్య పాత రోజులు ఇంకా గుర్తుండే ఉంటాయి. కాళ్లరిగేలా పింఛన్ కోసం తిరగాల్సిన పరిస్థితి.
– ఇంతకంటే కక్ష మరొకటి ఉందా? అసలు ఒక రాజకీయ పార్టీ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?
– ఎన్నికలకు ముందే చంద్రబాబు తన నిజస్వరూపాన్ని ప్రజలు చూపిస్తున్నాడు. అందరూ దీన్ని గమనించాలి.
– చంద్రబాబు తనకున్న చౌకబారు ఆలోచనల్లో భాగంగా తనకేం లాభం వస్తుందో, తన వారికి లబ్ధి ఏంటో ఆలోచిస్తాడు.
– ఇది తప్ప ప్రజలు, రాష్ట్రం ఆయనకు పట్టదు. ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా ఆయన ఆదే దృష్టితో చూస్తున్నాడు.
– ఓట్ల కోసమే వాలంటీర్ వ్యవస్థ పెట్టాలనే ఆలోచన జగన్ గారికి ఉంటే ఆ పనికే ఉపయోగించుకునేవాడు కానీ మిగిలిన ఇంత సంక్షేమం చేయడు కదా?
– ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ సక్సెస్‌కు కారణం ప్రభుత్వ డెలివరీ మెకానిజం అభివృద్ధి చేసింది కాబట్టే.
– జగన్ గారు పాదయాత్రలో తన ముందుకు వచ్చిన సమస్యల్లో 80 శాతం కిందికి చేరే పరిస్థితి ఉండేది కాదు.
– దానికోసమే ఇలాంటి ఒక నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశారు. మైక్రో లెవల్‌లో ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుందని పెట్టిన వ్యవస్థ.
– చాలా ఉన్నతమైన లక్ష్యంతో పెట్టింది. అది ఎవరికైనా ఉపయోగపడుతుంది.
– ప్రజలకు ఏదైనా చేయాలనే తపన ఉన్న వారికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.
– జగన్ గారు పెట్టిన వాలంటీర్ సిస్టమ్‌కు దానంతట దానికి ఈ గుర్తింపు రాలేదు. కిందికి శాచురేషన్ పద్దతిలో సక్సెస్‌ఫుల్‌గా అందించారు కాబట్టి అంతటి మంచి పేరు వచ్చింది.
– అంత కష్టపడిన దానికి చివరి లింక్ వాలంటీర్ సిస్టమ్. ప్రజలకు ఏదో చేయాలనే ఆలోచన లేకపోతే వాలంటీర్లను పెట్టుకుని ఏం లాభం..?
– ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజల ఆశీస్సుల కోసమే పనిచేస్తారు.
– కానీ కేవలం ఓట్ల కోసమే వ్యవస్థలను పెట్టడం అనేది జరగదు.
– ఇదే వ్యవస్థ చంద్రబాబు హయాంలో పెట్టి ఉంటే 2.60 లక్షల జలగలు తయారయ్యేవి.
– ఆయన రివర్స్‌లో రక్తం పీలుస్తాడు కాబట్టి వాళ్లు జలగల్లా తయారయ్యే వారు.
– ఆయన కిందికి పంపే పింఛన్లు, ఇతర పథకాలు లేవు కాబట్టి ఆ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉండేదే కాదు.
– ఒకవేళ ఆ వ్యవస్థ వల్ల పాజిటివిటీ వస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది.
– నువ్వు కూడా 2014–19 మధ్య ఇలానే చేసి ఉంటే నీకు కూడా ప్రజలు జైకొట్టేవారేమో?
*మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని చంద్రబాబు స్పష్టంగా చెప్తున్నాడు:*
– చంద్రబాబు కడుపుమంటతో పేదలకు, వృద్ధులకు వస్తున్న సర్వీసులను ఆపేశాడు.
– రాష్ట్రంలోని 66 లక్షల వృద్ధులకు, రేషన్ తీసుకునే వారికి మళ్లీ మా జన్మభూమి కమిటీలు వస్తాయనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు.
– లేఖలు రాస్తూ ఇప్పుడు ప్రజలందరికీ కితకితలు పెడుతున్నాడు.
– అర్జంటుగా మీరు ఏర్పాట్లు చేయండి అంటూ చీఫ్ సెక్రటరీకి లేఖ రాస్తున్నాడు.
– అధికారులు ప్రత్యామ్నాయం చూపకుండా ఎందుకు ఉంటారు..? ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదు..జగన్ గారి ప్రభుత్వం.
– నిన్నటి వరకూ రాష్ట్రంలో ఉద్యోగాలే లేవన్న వ్యక్తి ఇప్పుడు ఆ లేఖలో సచివాలయాల్లో 1.30లక్షల ఉద్యోగులు ఉన్నట్లు ఒప్పుకున్నారు.
– ఈసీ చెప్పింది..అర్జంటుగా పింఛన్లు పంపిణీ చేయండి అంటూ ఈయన డైరెక్షన్లు ఇస్తున్నాడు.
– అసలు నువ్వెవరూ..? ప్రభుత్వం అన్నాక పనిచేయకుండా ఉంటుందా?
– పనిలో పనిగా సిటిజన్స్ ఫర్ డెమెక్రసీ వారు కూడా సేమ్ పదాలతో లేఖలు రాశారు. బాబు రాసిన లేఖ కూడా వారే తయారు చేసినట్లున్నారు.
– ఇది చంద్రబాబు పెట్టిన సిస్టమ్, ప్రభుత్వం కాదు..జగన్ గారు పెట్టిన వ్యవస్థ.
– ప్రభుత్వం కచ్చితంగా చేయాల్సిన ప్రత్యామ్నాయాలన్నీ చేస్తుంది.
– కానీ నువ్వు జవాబు చెప్పాల్సిన విషయాన్ని కప్పిపుచ్చి లేఖలు రాస్తున్నాడు.
– సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయాలి అంటున్నప్పుడు వారు కూడా ప్రజల్ని ప్రభావితం చేయరా అనే దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి.
– ఇది చంద్రబాబుది చౌకబారు, దిగజారుడు ఎత్తుగడ.
– ఒక రాజకీయ నాయకుడిగా కూడా బిహేవ్ చేయాలనే ఇంగితం కూడా లేని వ్యక్తి చంద్రబాబు.
– ఇదేదో తమ పుట్టి ముంచుతుందేమోనని భయపడ్డట్లున్నాడు..మాకు సబంధం లేదంటూ కొత్త పల్లవి అందుకున్నాడు.
– దీన్ని కప్పిపుచ్చడానికి మీ దగ్గర డబ్బులు లేవంటూ కొత్త ఆరోపణలు చేస్తున్నాడు.
– ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని మీకు ఎవరు చెప్పారు?
– ఆర్థిక సంవత్సరం ముగింపు కాబట్టి..ఒకటో తేదీకు మందు డ్రా చేయడానికి ఇబ్బంది ఉంటుంది.
– రెండో తేదీన డ్రా చేసి మూడో తేదీ పంపిణీ చేస్తారు. దాంట్లో ఇబ్బందేమీ ఉండదు. ప్రతి ఏటా అదే జరుగుతుంది.
– దానికి అచ్చెన్నాయుడు ఒక కథ అల్లుతున్నాడు. ఖజానాలో డబ్బంతా బిల్లులు చేసుకున్నారంటూ కొత్త కథ అల్లాడు.
– మీరు ఒక వ్యవస్థకు గండి కొట్టి నేను కాదని బుకాయించడంలో వీరిని మించిన వారు లేరు.
– మీరు చెప్పాల్సిందేముంది మేం పెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారానే పింఛన్లు పంపిణీ జరుగుతాయి.
– కాకపోతే ఇంత ముందు ఇంటి వద్దకు వచ్చేవి. ఇప్పుడు సచివాలయం వద్దకు వెళ్లి తీసుకోవాలి.
– కాకపోతే గతంలో జరిగినంత వేగంగా జరగకపోయినా పంపిణీ జరుగుతుంది.
– ఆ అవకాశం లేదు కానీ రేపు పొరపాటున చంద్రబాబు వస్తే జరగబోయేది ఏంటో కళ్లకు కట్టినట్లు చూపించాడు.
*చంద్రబాబు పొత్తు పొడుపులో ఏం జరగబోతోందో మేం ముందే చెప్పాం:*
– మా నాయకుడు ప్రజల్లోకి వెళ్తుంటే జనసునామి ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది.
– ఈ ఐదేళ్లుగా ఆయన చేసిన సేవకు బదులుగా రుణం తీర్చుకోడానికి మేం సిద్ధంగా ఉన్నామని ప్రజలు చెప్తున్నారు.
– చంద్రబాబు రెండేళ్లుగా ఒక కథ అల్లుతూ వచ్చాడు. జగన్ గారి వ్యక్తిత్వ హననం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
– చంద్రబాబుకు ఉన్న లక్షణాలను జగన్ గారికి ఆపాదించి తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
– గంభీరంగా పొత్తు పెట్టుకుని పవన్ కల్యాణ్, చంద్రబాబు మేం ఏం చెప్తున్నామో అదే జరుగుతోంది.
– కలిసిన తర్వాత ఏం జరగబోతోందో కూడా ముందే చెప్పాం. పవన్ కల్యాణ్‌ను, బీజేపీని కూడా మింగేస్తాడని చెప్పాం. అదే జరిగింది.
– పొత్తు వద్ద, సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక వద్ద వారితో ఎలా ఆడుకున్నాడో అందరూ చూస్తున్నారు.
– చివరికి పవన్ కల్యాణ్ అనే వ్యక్తికి పిఠాపురం పొమ్మంటే అక్కడకు వెళ్లి దీనంగా ఇక్కడే ఉంటా అని బతిమిలాడుకుంటున్నాడు.
– ఆయన బయట తిరిగితే పిఠాపురం వాళ్లు నమ్మరు. పోనీ రాష్ట్రమంతా తిరగాలంటే ఆయనకు 21 సీట్లే ఇచ్చాడు.
– వాటిలో కూడా 18 మంది టీడీపీ, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. ఒరిజినల్‌గా పవన్ ఉన్న వాళ్లంతా పక్కకు పోయారు.
– సిటిజన్స్ ఫర్ డెమెక్రసీకి, జనసేనకు తేడా లేదు. ఇక్కడ ఐఏఎస్‌లతో పెట్టించాడు. ఇక్కడ పవన్‌తో పెట్టించాడు.
– కనీసం ఆయన అభ్యర్థులను కూడా ఆయన ఎంపిక చేసుకునే పరిస్థితి లేదు.
– బీజేపీ కూడా అదే రీతిన మారింది. గతంలో వాళ్ల అభ్యర్థులను వారే పెట్టుకునే వారు.
– ఈసారి అక్కడి అభ్యర్థులను కూడా ఈయనే తనవాళ్లను పెట్టుకున్నాడు.
– టీడీపీలో కూడా పాము సొంత పిల్లల్ని తిన్నట్లు మొదటి నుంచీ ఉన్న వారికి అన్యాయం చేశాడు.
– డబ్బులు ఇచ్చిన వారు సడన్‌గా తెరమీదకు వస్తున్నారు. వాళ్ల పార్టీ వాళ్లిష్టం.
– నీ సొంత పార్టీలోనే నువ్వు టికెట్లు ముందు నుంచి ఉన్న వాళ్లకి ఇవ్వలేదు..
*ఈ సారి బాబు తిప్పిన చక్రం తన గొంతుకే చుట్టుకుంది:*
– మేం బీసీలు, మైనార్టీలను పెంచడానికి ప్రయత్నం చేశాం. మా అభ్యర్థుల ఎంపికలో ఒక హేతుబద్ధత ఉంది.
– కానీ టీడీపీలో, ఆయన పొత్తు పెట్టుకున్న పార్టీల్లో హేతుబద్దత కనిపించదు. కారణం ఎంపికంతా ఒక్కడే చంద్రబాబు చేశాడు.
– ఈ సారి ఆయన తిప్పిన చక్రం మొత్తం తన మెడకే చుట్టుకుంది.
– ఇక ఆయన పని అయిపోయింది. వీలైనంత సంపాదించుకుని వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు.
– అందుకే రోజూ జగన్ గారిని తిట్లు తప్ప వేరేది లేదు. ఏదైనా ఆయన చేసిన అలివిగాని అభివృద్ధి ఉందా అంటే అదీ లేదు చెప్పుకోడానికి.
– అందుకే జగన్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు.
– అందుకే పచ్చ పత్రికలు రాసే థర్డ్ గ్రేడ్ కథనాలతోనే చంద్రబాబు స్పీచ్‌లా మాట్లాడుతున్నాడు.
– ప్రజలకు మేమంతా కలిసి ఏమైనా చేస్తాం అనే చెప్పే ధైర్యం కూడా చేయలేకపోతున్నాడు. అలా చెప్తే గతంలో ఇచ్చిన హామీలేమయ్యాయి అని అడుగుతారు కాబట్టి.
– మరో పక్క జగన్ గారు నమ్మకంపై నిలబడి గీటురాయిగా పనిచేస్తూ ముందుకు వెళ్లారు.
– ప్రజల జీవితాలు మెరుగుపడాలని, నిరంతరంగా పని చేసుకుంటూ వెళ్లిన ఫలితమే ఈ రోజు జగన్ గారికి వస్తున్న ప్రజాస్పందన.
– ప్రజల రక్తం పీల్చే జలగల్లాంటి శక్తులు ఏకమై అన్ని రకాల కుట్రలతో చేస్తున్న చివరి ప్రయత్నం ఇది.
– మా ధీమా మాత్రం ప్రజలే మాకు స్టార్ క్యాంపెయినర్ ఉన్నాడు. వాళ్లే మాకు ప్రచారం చేస్తారు.
– ప్రజలకు మంచి చేస్తే ప్రజలు ఓటేస్తారు కాబట్టి ప్రజలందర్నీ దూరం పెట్టండి అన్నట్లుంది చంద్రబాబు తీరు.
– ఇంతకు ముందు లోకేశ్‌కు ఈ రాష్ట్రంలో భద్రత లేదా? బాగానే తిరుగుతున్నాడు..రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూనే ఉన్నాడుగా..?
– అప్పుడేమీ ఆయన భద్రతకు ఢోకా రాలేదు కదా? మేం సెక్యూరిటీ ఇస్తేనే కదా ఆయన రాష్ట్రంలో తిరిగింది?
– ఎన్నికల వేళ ఏమీ చేయలేక ఇలాంటివి రోజుకొకటి ఆరోపణలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.