వైయస్ విజయమ్మ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు
8 Jul, 2022 18:03 IST
గుంటూరు: వైయస్ విజయమ్మ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, ఎల్లోమీడియాపై సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సజ్జల శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, ఎల్లోమీడియా దిగజారుడు రాజకీయం చేస్తున్నాయి. వైయస్ విజయమ్మ ప్రసంగాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి విమర్శించడానికి ఏమీలేక విజయమ్మ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. విజయమ్మ వ్యాఖ్యలపై పెడార్థాలు తీస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.