మురళీనాయక్ కుటుంబ సభ్యులకు శైలజనాథ్ పరామర్శ
12 May, 2025 17:07 IST
శ్రీ సత్యసాయి జిల్లా: కశ్మీర్‌లో విధి నిర్వహణలో ఉండగా పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో మరణించిన అగ్నివీర్ ముదావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు సాకే శైలజనాథ్ పరామర్శించారు. సత్య సాయి జిల్లా, గోరంట్ల మండలం, కల్లి తండాకు వెళ్లి మురళి నాయక్ తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం మురళీ నాయక్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. మురళి నాయక్ దేశంలోని యువతకు ఆదర్శంగా నిలిచారని, భవిష్యత్తులో ప్రతి ఒక్క యువత దేశ రక్షణ వైపు అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు శివశంకర్ నాయక్, పాలే జయరాం నాయక్, జడ్పిటిసి నగేష్ నాయక్, కృష్ణా నాయక్, సర్పంచ్ మురళి నాయక్, ధనుంజయ నాయక్, మహేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.