వైయ‌స్ఆర్‌ సీపీని టచ్ చేసే దమ్ము ఏ పార్టీకి లేదు

29 Dec, 2023 21:45 IST

అర‌కు: ఆదివాసీల సీమలో వైయ‌స్ఆర్‌ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ఉవ్వెత్తున ఎగసి.. ఉత్సాహంగా సాగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బస్సుయాత్రలో భాగంగా వచ్చిన ప్రజా ప్రతినిధులు  అల్లూరి జిల్లా ఇన్ చార్జి మంత్రి గుడివాడ అమర్ నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి,  అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ, జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎంపీ గొట్టేట మాధవి, జీసీసీ చైర్ పర్సన్ శోభా స్వాతిరాణి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజులు   హూకుంపేట మండంలో నాడు - నేడు కార్యక్రమం ద్వారా చేపట్టిన అబివృద్ధి పనులను పరిశీలించారు.  అనంతరం హుకుంపేట జంక్షన్ జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. 

చంద్రబాబుది ఒక మొగుడు.. నాలుగు పెళ్లాల స్కీమ్, జనసేన కాదది. భజన సేన, బాణాల్లా ఓట్లను ఎక్కుపెట్టి గిరిజనులు  జగన్ ను సీఎం చేయాలి - ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ పిలుపు

ఈ సందర్భంగా అశేషంగా  తరలివచ్చిన బహిరంగ సభలో  ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, సామాజిక సాధికార యాత్రకు వస్తున్న జనసందోహాన్ని టీడీపీ చూస్తే గుండెళ్లో రైళ్లు పరుగెడతాయని, చంద్రబాబు గిరిజనుల విషయంలో ఎన్నో డ్రామాలు ఆడాడని  మండిపడ్డారు.  అల్లూరి సీతారామారాజు అప్పట్లో బ్రిటీష్ బానిస సంకెళ్లు తెంచేందుకు బాణాలు ఎక్కుపెట్టినట్లే వచ్చే ఎన్నికల్లో  ఓట్ల రూపంలో  గిరిజనులు జగన్ కు వేసి గెలిపించుకోవాలని కోరారు. గిరిజన ప్రాంతాన్ని సశ్యశ్యామలం చేసేందుకు జగన్ కంకణ బద్దులై ఉన్నారని, అంతటా అద్భుతమైన రహదారులను నిర్మించి  ఆదివాసీల ప్రాంత స్వరూపాన్ని మార్చేశారని కొనియాడారు. అటవీ భూమి హక్కుల చట్టాన్ని తీసుకువచ్చిన ఘనత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని అన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ గుర్తుకు రాదని, ఇప్పుడు కొత్తగా ఒక మొగుడు.. నాలుగు పెళ్లాల స్కీమ్ పేరుతో ఎన్నికల ముందు ప్రజలకు వస్తున్నారని ధర్మశ్రీ ఎద్దేవా చేసారు. పవన్ కల్యాణ్ ది జనసేన కాదని, అది భజన సేన అని హేళన చేసారు. చంద్రబాబును ఎక్కడ పెట్టాలో పెట్టి.. ఎక్కడికి తొక్కాలో  గిరిజన ప్రజలకు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు.  గిరిజనులంతా ఓట్ల బాణాలను ఎక్కుపెట్టి జగన్ ను సీఎం చేయాలని పిలుపునిచ్చారు.  
 
 వచ్చే ఎన్నికల్లో ఎగిరేది వైయ‌స్ఆర్‌ సీపీ జెండానే - అరకు ఎంపీ గొొట్టేట మాధవి

అరకు ఎంపీ గొట్టేట మాధవి మాట్లాడుతూ, ఈ నియోజకవర్గంలో వైసీపీని టచ్ చేసే దమ్ము మరే పార్టీకి లేదని సాధికార యాత్రకు వస్తున్న జనాన్ని చూస్తుంటే  తెలుస్తోందన్నారు. పొత్తులు పెట్టుకుని టీడీపీ, జనసేన గుంపులు గుంపులుగా వస్తుంటే, జగన్ అన్న ఒక్కరే పోటీకి దిగుతున్నందున రాష్ట్రమంతటా కూడా ఎగిరేది వైసీపీ జెండానే అని ధీమా వ్యక్తం చేసారు.   పిల్లల భవిష్యత్తు కోసం నిత్యం ఆలోచించే ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని, గిరిజనులతో పాటుగా అందరి పిల్లలు ఉన్నత చదవులు చదువుకోడానికి  పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసారని, సాలూరులో గిరిజిన యూనివర్శిటీ, గిరిజన ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దే నని ఉద్ఘాటించారు.  గిరిజనుల జీవితాల్లో వెలుగు చూసేందుకు జగన్ నిరంతరం పరి తపిస్తున్నారని, ఆదివాసీల పట్ల ప్రేమ, అప్యాయత చూపే నేత  తెలుగుదేశం పార్టీలో  ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో గిరిజన శాఖకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, జగన్ తన హయాంలో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి ఆత్మగౌరవాన్ని నిలిపారన్నారు. 

సామాజిక సాధికారత జగన్ కు ఓ విధానం.. ఇతర పార్టీలకు కేవలం నినాదం మాత్రమే.. - జడ్పీ చైర్  పర్సన్ సుభద్ర

విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్  జల్లుపల్లి సుభద్ర మాట్లాడుతూ,  సామాజిక సాధికారత అనేది  జగన్ కు  ఓ విధానంగా భావించి ఆచరించి అమలు చేయగా,  ఇతర రాజకీయ పార్టీలు సాధికారతను  కేవలం నినాదాంగా మాత్రమే వాడుకున్నారని విమర్శించారు.  ఆదివాసీల్లోని అన్ని జాతులకు, తెగలకు కూడా రాజకీయంగా పదవులు ఇచ్చి రాజకీయ సాధికారతను కల్పించారన్నారు. రాష్ట్ర కేబినెట్ లో సైతం ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించి అట్టడుగు వర్గాలను అందలం ఎక్కించారన్నారు.  ఎన్నికల ముందు ఇచ్చే హామీల మ్యానిఫెస్టోను దాదాపుగా పూర్తిగా అమలు చేసిన నాయకుడు జగన్ కాగా, ఇతర పార్టీలు మ్యానిఫెస్టోను ఎన్నికల తర్వాత పట్టించుకోలేదని గుర్తు చేసారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించి వైసీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకమై జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి - ఎమ్మెల్సీ కుంభా రవి బాబు

ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ,  ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పనులు మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు మరోసారి జగన్ ను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన  ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. గిరిజనుల ఆరోగ్య, ఉపాధి, ఆర్థిక, సామాజిక అబివృద్ధి కోసం  జగన్ నిరంతరం పని చేస్తున్నారన్నారు. గిరిజనులకు ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లను రద్దు చేసి చంద్రబాబు వివక్ష చూపారని, జగన్ సీఎం అయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా గిరిజనులకే పెద్దపీట వేసారని గుర్తు చేసారు. టీడీపీ గిరిజనుల కోసం రూ. 12 వేల కోట్లు ఖర్చు చేయగా, రూ. 23 వేలకోట్లు ఖర్చు చేసి సంక్షేమానికి, అభివృద్ధికి బాటలు వేసారన్నారు. రాజ్యాంగ పరమైన హక్కులను కల్పించే ఎస్టీ కమిషన్ ను జగన్ సీఎం కాగానే నియామకాలు చేసారని, చంద్రబాబు హయాంలో ఎస్టీ కమిషన్, ట్రైకార్, జీసీసీ వంటి పదవులను భర్తీ చేయకుండా గిరిజనులను తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా  ముఖ్యమంత్రి జగన్  3, 46,000 ఎకరాల భూమిని గిరిజనులకు పంపిణీ చేసి భూమి హక్కులను  కల్పించారన్నారు. రాష్ట్రంలోని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఏకమై జగన్ ను ముఖ్యమంత్రిగా గెలిపించాలని పిలుపునిచ్చారు.   

బాక్సైట్ జీఓను రద్దు చేసి జగన్ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపారు - అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ

అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వృద్ధులకు, మహిళలకు జగన్ ప్రభుత్వం రూ. 3 వేల పెన్షన్ ను అందించనున్నారని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో జగన్ కు ఎవరూ సాటి రారు అనడానికి ఇదే నిదర్శనమని వెల్లడించారు.    నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో జగన్ సీఎం అయిన తర్వాత రూ. 141 కోట్ల రూపాయలతో నాడు - నేడు పనులు చేపట్టి అభివృద్ధికి బాటలు వేసామని వివరించారు. అలాగే గిరిజన విద్యార్థుల ఉన్నత చదవులు చదువుకోవాలన్న సంకల్పంతో జగన్ గిరిజన ప్రాంతాల్లో సెంట్రల్ యూనివర్శిటీ, ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు చేసారని గుర్తు చేసారు. అలాగే నియోజవర్గంలో రూ.  6వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, బ్రిటీష్ కాలం నుంచి రోడ్లు లేని గ్రామాలకు జగనన్న ప్రభుత్వంలో తారు రోడ్లు వేసి ఆదివాసీ ప్రాంతాలకు మహర్దశను కల్పించారన్నారు.  గత ప్రభుత్వంలో కేవలం పసుపు చొక్కాలు వేసుకున్న వారు లంచాలు తీసుకుని పథకాలు ఇచ్చారని,  జగన్ మాత్రం కుల, మతాలకు అతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. గిరిజనుల తలరాతలు తిరిగిరాస్తున్న జగన్ ను శాశ్వత ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నికల నుంచి గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా  ఉందన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు అంత్రాక్స్ వంటి  వ్యాధులు ఏజెన్సీలో ప్రబలినపుడు పట్టించుకోలేదని, అలాగే  ఈ ప్రాంతంలోని బాక్సైట్ వంటి  వనరులను దోచుకోవాలని ప్రయత్నం చేయగా,  పాదయాత్రలో ఉన్న జగన్ కు ఓ వినతిని ఇవ్వగా అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ జీఓని ఇచ్చారని వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతాలకు అత్యాధునిక సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు 200 సెల్ టవర్లు,  ఏర్పాట్లు చేసామన్నారు. ఒడిశాకు ఆనుకుని ఉన్న గ్రామాలకు బ్రిడ్జిలు లేకపోతే, 18 వంతనెలను రూ, 56 కోట్లతో నిర్మాణం చేపట్టామని వివరించారు. 39,450 మందిక ఆదివాసీలకు  జగన్ ప్రభుత్వం పట్టాలివ్వడమే కాకుండా దానికి రైతు భరోసాను కూడా కల్పించామని ఫాల్గుణ వెల్లడించారు.  

మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ,  గిరిజనుల అభ్యున్నతి కోసం అసమానతలు లేకుండా శాశ్వత పరిష్కారాలు  జగన్ చూపుతున్నారని, గతంలో పాలకులు మొసలి కన్నీరు కారుస్తూ సానుభూతిని చూపేవారని, జగన్ ముఖ్యమంత్రి  అయిన తర్వాత విద్య, వైద్యం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. దేశంలో మరే ఇతర సీఎం చేయలేని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివక్ష లేకుండా అమలు చేస్తున్నది జగన్ మాత్రమేనని గుర్తు చేసారు.  గిరిజనులకు రెండు జిల్లాలు, రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటుతో సహా ఎన్నో అభివృద్ధి పనలు చేస్తున్నారని, మనందరం ఈ ఎన్నికల్లో జగన్ వెంటే ఉన్నామని మరోసారి చాటిచెప్పాలని  పిలుపునిచ్చారు.