దేశరాజకీయాల్లోనే జగనన్న ఓ సంచలనం 

5 Jan, 2024 21:19 IST

తిరుప‌తి జిల్లా: వెంకటగిరి నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాదిమంది జనంతో వెంకటగిరి పట్టణం కిక్కిరిసిపోయింది. బస్సుయాత్ర ర్యాలీని భారీగా జనం అనుసరించారు. బహిరంగసభకు జనం పోటెత్తారు. మహిళలు భారీ సంఖ్యలో హాజరవడమే కాదు సభ సాంతం కదలకుండా కూర్చున్నారు. ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, అలీ ఉపన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సభ వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. జెడ్పీటీసీ మెంబర్లు, ఎంపీలు, సర్పంచ్‌లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు

 ఎంపీ గురుమూర్తి
– దళితుల పిల్లల చదువుల కోసం ఈ నాలుగున్నరేళ్లలో పదివేల కోట్లరూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే మహిళల కోసం మరో పదివేల కోట్లరూపాయలు ఇచ్చారు. 
అన్నీ కలుపుకుంటే ఎస్సీలకోసమే రూ.86వేల కోట్ల రూపాయలు అందించారు సీఎం జగనన్న.
– మళ్లీ జగనన్న వస్తేనే మన జీవితాల్లో వెలుగులు. సంక్షేమపథకాలు ఆగకుండా రావాలంటే జగనన్నే మళ్లీ రావాలి.

ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌
దేశ రాజకీయాల్లోనే జగనన్న అంటేనే ఓ సంచలనం. జగనన్న అంటేనే ఓ విప్లవం. 
– చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంను అంటాడు. ఈ ఆంధ్రరాష్ట్రంలో ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. మరి ఆయన సాధించింది ఏమిటో ఎవరికీ తెలియదు. బహుశా, ఆయనకు కూడా తెలియదేమో.
– మన పిల్లల్ని చదివించే బాధ్యత జగనన్న తీసుకున్నాడు. సంవత్సరానికి రూ.15 వేల రూపాయలు ఇస్తున్నాడు. మన పిల్లలు చదువుకుంటేనే వారికి భవిష్యత్తు బాగుంటుందని జగనన్న ఎంతో కృషి చేస్తున్నారు.
– మన పిల్లలు ఈరోజు బెంచీలమీద కూర్చుంటున్నారు. దర్జాగా యూనిఫాంలు, షూస్‌లు వేసుకుని, టైలు కట్టుకుని..ఇంగ్లీషు మీడియం చదువులు చదువుతున్నారు. ధనవంతుల పిల్లలకు, పేదల పిల్లలకు తేడా లేకుండా చేసిన జగనన్నకు మనం ఎంతగా రుణపడిపోయామో అర్థం చేసుకోవాలి.
– ఇక పేదలకు ఎలాంటి జబ్బులు చేసినా, ఎంత పెద్దవైనా పాతిక లక్షల మేర వైద్యసాయం అందించేలా చేస్తున్నారు జగనన్న.
– ప్రతి ఒక్క ఇంటికీ నేరుగా డబ్బులు అందించడం ద్వారా ..రూ.2.46లక్షల కోట్ల రూపాయలు పేదలకు అందించారు జగనన్న.
– ఈరోజు బీదాబిక్కీకి ధైర్యమిచ్చి, తోడుగా నిలబడ్డాడు ముఖ్యమంత్రి వైయ‌స్  జగన్‌మోహన్‌రెడ్డి.

 అలీ, ఎలక్ట్రానిక్‌ మీడియా అడ్వైజర్‌
– కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం...ప్రేమనే చూస్తాం అనే జగనన్న..తన మహానేత వైఎస్సార్‌ కన్నా నాలుగు అడుగులు ముందుకేసి, సంక్షేమపథకాల వెల్లువను సృష్టించారు.
– ఇంకా ఇంకా పేదలకు ఎంతో మంచి చేయాలని తపిస్తున్న నాయకుడు జగనన్న
– ఎన్నడూ చిరునవ్వు చెదరనివ్వని జగనన్న ప్రజల జీవితాల్లోనూ అదే సంతోషాన్ని చూడాలని ప్రజాపాలన చేస్తున్నారు.
–2019లో జగనన్నను ముఖ్యమంత్రిగా ఎన్నుకుని..మన జీవితాల్లో వెలుగులు తెచ్చుకున్నాం. మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడం మనకు చాలా చాలా అవసరం