సీఎం వైయస్ జగన్‌కు ఆర్‌టీసీ జేఏసీ కృతజ్ఞతలు
11 Jun, 2019 15:09 IST
అమరావతి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నందుకు సీఎం వైయస్ జగన్‌కు జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు, జేఏసీ నేతలు చర్చలు జరిపారు. చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన జేఏసీ నేతలు.. యాజమాన్యంతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని చెప్పారు. 26 అంశాలపై ఎంవోయూ ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు. ఆర్థికపరమైన అంశాలు సీఎం దృష్టికి తీసుకెళ్తామని జేఏసీ నేతలు తెలిపారు.