సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.40 లక్షలు
17 Jun, 2020 14:41 IST
అమరావతి: ముఖ్యమంత్రి సహాయ నిధికి పత్తికొండ ఎమ్మెల్యే చెరుకులపాడు శ్రీదేవి రూ.40 లక్షలు అందజేశారు. కరోనా వైరస్ మహమ్మారిని అరి కట్టడానికి పత్తికొండ నియోజకవర్గం వైయస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారులు, రేషన్ డీలర్లు, ఫర్టిలైజర్, నియోజకవర్గం ప్రజలు అందరి తరుపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయంగా రూ. 40,89,016 లక్షల రూపాయల చెక్కు ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అందజేశారు. బుధవారం అసెంబ్లీ హాల్లో ఎమ్మెల్యే శ్రీదేవి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి సీఎంను కలిసి చెక్ అందజేశారు.