రాప్తాడు టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లగా రౌడీషీటర్లు
22 May, 2019 15:29 IST
అనంతపురం: రౌడీషీటర్లకు కౌంటింగ్ ఏజెంట్లగా అనుమతి ఇవ్వడం దుర్మార్గమని వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ చీఫ్ ఏజెంట్ నారాయణ చౌదరి సహా 17 మంది నేర చరిత్ర ఉన్నవారికి కౌంటింగ్ ఏజెంట్లుగా ఆర్వో అనుమతి ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆర్వో జయ నాగేశ్వరరావుపై కలెక్టర్,ఎస్పీ,డీజీపీలకు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో గొడవలు సృష్టించేందుకు పరిటాల సునీత కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.