గాజువాక రోడ్డు ప్రమాదం బాధాకరం 

31 May, 2026 16:02 IST

 
 
విశాఖపట్నం నగరంలోని గాజువాక శ్రీనగర్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి,  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ  వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం నుంచి రామభద్రాపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు.

మృతుల కుటుంబ సభ్యులకు వైయస్‌ జగన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఏడుగురు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన, బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని వైయస్‌ జగన్‌ ప్రార్థించారు.