కరోనా నియంత్రణపై సమీక్షా సమావేశం ప్రారంభం
1 Apr, 2020 12:52 IST
తాడేపల్లి: కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పశుసంవర్థక, మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ, సీఎస్ నీలం సాహ్నిం, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో పెన్షన్ పంపిణీ జరుగుతున్న తీరు, ఆస్పత్రుల్లో కరోనా నియంత్రణకు ఏర్పాటు చేసిన బెడ్లు, వైద్య సదుపాయాలు, ల్యాబ్ టెస్టింగ్ రిపోర్టులపై సీఎం వైయస్ జగన్ అధికారులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే విధంగా రెండో విడత ఇంటింటి సర్వేపై సీఎం సమీక్షించనున్నారు.