సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
26 Jan, 2024 09:16 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ వేడుకకు పలువురు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.