ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు..
26 Jan, 2023 10:01 IST
విజయవాడ: గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గురువారం ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.
శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ వేడుకల్లో సీఎం వైయస్ జగన్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చే హైటీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.