విశాఖ స్టేడియానికి వైయస్ఆర్ పేరు తొలగించటం అన్యాయం
తాడేపల్లి : విశాఖ స్టేడియానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పేరు తొలగించటం అన్యాయమని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం నిర్వాకంతో బ్రాండ్ ఏపీ అనేది పాతాళంలోకి పడిపోయిందన్నారు. పేర్ల మార్పు మీద చూపే శ్రద్ద.. రాష్ట్ర అభివృద్ధి మీద లేకపోవడం దురదృష్టకరమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక హెల్త్ యూనివర్సిటీ, వైయస్ఆర్ జిల్లా పేర్లను కూడా మార్చిందని తప్పుపట్టారు. దీనివలన ఏం సాధించారో వారికే తెలియాలని ఫైర్ అయ్యారు. వైయస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయటం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని ఆక్షేపించారు. వాళ్లు చెప్పే ప్రాజెక్టులు, అభివృద్ధి అంతా కాగితాల మీదే ఉందని ఎద్దేవా చేశారు. ఫలకాల మీద పేరు తొలగించినా జనం గుండెల్లో నుంచి వైయస్ఆర్ పేరును తొలగించలేరని సీదిరి అప్పలరాజు హెచ్చరించారు.