పూడి శ్రీహరికి హైకోర్టులో ఊరట
1 May, 2026 16:36 IST
గుంటూరు: వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి(మీడియా విభాగం) పూడి శ్రీహరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో ఆయనను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో 41ఏ నోటీసులు జారీ చేసి విచారణకు పిలవాలని హైకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ, చట్టపరమైన విధానాలను పాటించాలని పోలీసులకు సూచించింది.
ఇక గుంటూరు కోర్టులోనూ పూడి శ్రీహరికి ఊరట లభించింది. కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. విచారణ కోసం నోటీసులు జారీ చేసి హాజరు కావాలని కోర్టు పేర్కొంది. గుంటూరు కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని కొత్తపేట కేసుపై విచారణ కొనసాగిస్తామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.