తిరుపతిలో `రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో..`
20 Jul, 2025 19:07 IST
తిరుపతి: తిరుపతి నియోజకవర్గం దక్షిణ మండలం 49వ వార్డు నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించారు. వైయస్ఆర్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా పర్యటించి చంద్రబాబు మోసాలను వివరిస్తూ స్కాన్ చేయించారు. కార్యక్రమంలో దక్షిణ మండలాధ్యక్షుడు నవీన్ బృంగి, వార్డు అధ్యక్షుడు రెడ్డప్ప, తలారి రాజేంద్ర, దుర్గ, ప్రసాద్, స్వరూప్, కోటి, దినేష్, తదితరులు పాల్గొన్నారు.