మంత్రి సవిత సొంత పంచాయతీలో మొద‌లైన‌ తిరుగుబాటు

1 Apr, 2026 15:42 IST

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా: పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవితపై వ్యతిరేకత మొదలైందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆమె సొంత పంచాయతీ పరిధిలోనే టిడిపి నేతలు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పెనుకొండ మండలం రాంపురం పంచాయతీకి చెందిన కొండంపల్లి గ్రామంలో టిడిపి సీనియర్ నాయకులు పి. వెంకటరామిరెడ్డి, పి. రామిరెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. 2024 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో టిడిపిపై విసుగు చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. పెనుకొండలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ భర్త చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా కొత్తగా చేరిన నాయకులకు వైయ‌స్ఆర్‌సీపీ కండువా వేసి చరణ్ రెడ్డి పార్టీకి సాదరంగా ఆహ్వానించారు. వారిని అభినందిస్తూ పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.