రావులపాలెం పంచాయతీ స‌ర్పంచ్‌కు ఘన సత్కారం 

30 Mar, 2026 16:57 IST

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: రావులపాలెం గ్రామ పంచాయతీ  ఐఎస్‌వో  గుర్తింపు సాధించడంపై వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తాడేపల్లి నాగమణి, ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డిలను జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఘనంగా సన్మానించారు. పూలదండలు వేసి, శాలువాలు కప్పి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అమ‌లు చేసిన స‌చివాల‌య‌, వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ల ద్వారా గ్రామంలో పరిశుభ్రత, అభివృద్ధి, పారదర్శక పాలనలో ఉన్నత ప్రమాణాలు పాటించడం వల్లే ISO గుర్తింపు సాధ్యమైందని పేర్కొన్నారు. ఇలాంటి విజయాలు ఇతర గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు గ్రామ సిబ్బందిని కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.