జాతీయ సమ్మెకు వైయ‌స్ఆర్‌సీపీ సంఘీభావం

12 Feb, 2026 16:19 IST

అనంతపురం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన జాతీయ సమ్మెకు వైయ‌స్ఆర్‌సీపీ సంఘీభావం తెలిపింది. ఈ మేర‌కు అనంత‌పురంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియ‌న్‌ జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ టవర్ క్లాక్ వద్ద ముగిసింది. ర్యాలీలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని కార్మిక సంఘాలకు సంఘీభావం తెలిపారు. ర్యాలీ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన విధానాలను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు.

కార్యక్రమంలో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి, నాయకులు చింతా సోమశేఖర్ రెడ్డి, రమేష్ గౌడ్, పెన్నోబులేష్, కొర్రపాడు హుసేన్ పీరా, వెన్నం శివారెడ్డి, సైఫుల్లా బేగ్, నరసింహులు, చింతకుంట మధు, మల్లెల వేణు, నాగార్జున రెడ్డి, రత్నమయ్య, టీవీ టవర్ నగేష్, పురుషోత్తం రెడ్డి, రామాంజులరెడ్డి, వినిత్, శ్రీనివాసులు, శేఖర్, రఫీ, ముక్తియార్, అశోక్, వైయ‌స్ఆర్‌ ట్రేడ్ యూనియన్ నాయకులు సంపంగి రామాంజనేయులు, ప్రకాష్, కోటిరెడ్డి, రామంజి రాయల్, అనిల్ కుమార్ గౌడ్, వెంకట్ రెడ్డి, ఖాజా, కాకర్ల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.