రైళ్లలో అపరిశ్రుభమైన బెడ్‌రోల్స్‌ సరఫరా చేస్తున్నారు

27 Jun, 2019 12:37 IST

న్యూఢిల్లీః రైల్వే ప్రయాణికుల సమస్యలను వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు.రైళ్లలో అపరిశ్రుభమైన బెడ్‌రోల్స్‌ సరఫరా చేస్తున్నారని ఏపీ సరిగా ఉండటం లేదని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.విశాఖపట్నం, తిరుపతి,చెన్నై,బెంగుళూరు వెళ్ళే రైళ్లల్లో తరుచూ ఈ ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.ఏపీ ఎక్స్‌ప్రెస్,కోరమండల్,ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ల్లో సరిగా ఏసీ సదుపాయం ఉండటం లేదన్నారు.రైల్వేశాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు.రైళ్లలో క్లీన్‌ బెడ్‌రోల్స్,అంతరాయం లేకుండా ఏసీ సరఫరా చేయాలన్నారు.కనీస ప్రాథమిక సౌకర్యాలను పరిశుభ్రంగా కల్పించాలని కోరారు.