అమర్నాథ్ కుటుంబానికి 36 గంటల్లోనే సంపూర్ణ సహకారం
తాడేపల్లి: విద్యార్థి అమర్నాథ్ కుటుంబానికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి 36 గంటల్లోనే సంపూర్ణ సహకారం అందించారని వైయస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ తెలిపారు. అమర్నాథ్ హత్య దురదృష్టకరమని అన్నారు. వారి కుటుంబానికి ఇంటి స్థలం, ఇల్లు, ఉద్యోగం కూడా ఇస్తామన్నామని తెలిపారు. ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి.. నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేయించిందన్నారు. చంద్రబాబు శవరాజకీయాలకు తెరలేపుతున్నాడని, ప్రతిచోటా రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ ఆరాటపడుతోందని విమర్శించారు. బాబూ.. చేతనైతే బాధిత కుటుంబానికి సాయం చేయాలి కానీ శవాలపై పేలాలు ఏరుకోవడం సరికాదని హితవు పలికారు.
వైయస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఏం మాట్లాడారంటే:
అది కులాలకు, మతాలకు సంబంధం లేని సంఘటన:
- నాలుగు రోజుల క్రితం ఉప్పాలవారిపాలెం గ్రామంలో అమర్నాథ్ అనే బాలుడు హత్య జరిగింది.
- కులాలకు, పార్టీలకు సంబంధం లేదు..రెండు కుటుంబాల మధ్య జరిగిన వ్యక్తిగత సంఘటన. పూర్తిగా వ్యక్తిగతమైన కారణాలు.
- ఎవరి ప్రమేయం, ప్రోద్బలం, సహాయ సహకారాలు లేనటువంటి సంఘటన.
- చిరంజీవి అమర్నాథ్ అతి కిరాతకంగా హత్యకు గురికావడం దురదృష్టకరం.
- హత్య జరిగిన నాలుగైదు గంటల్లోనే ముగ్గురు ముద్దాయిలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
- కస్టడీలోకి తీసుకున్న 24 గంటలు గడవక ముందే ఆ కుటుంబాన్ని నేను పరామర్శించాను.
- అమర్నాథ్ సోదరికి ఉద్యోగం కావాలని అడిగారు..ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం, ఇంటి స్థలం, ఇళ్లు కోరారు.
- వీటితో పాటు ఈ సంఘటనలో బాధ్యులైన నలుగురిపై త్వరితగతిన విచారణ చేపట్టి శిక్ష వేయాలని వారు కోరారు.
- వాటన్నిటికీ మేం స్పష్టమైన హామీలు ఇచ్చాం. ఇచ్చిన హామీ మేరకే గంటల్లోనే ముద్దాయిలను అరెస్ట్ చేశారు.
అమర్నాథ్ కుటుంబానికి 36 గంటల్లోనే సంపూర్ణ సహకారం:
- ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందించారు.
- వాటితో పాటు ఇంటిస్థలం, ఇల్లు, అంగన్ వాడీ ఉద్యోగం మేం వారికి ఇచ్చాం.
- ప్రభుత్వ పరంగా మేము ఇచ్చిన హామీలను 36 గంటల్లోనే పూర్తి చేశాం.
- పెండింగ్ ఉన్నది ముద్దాయిలపై త్వరితగతిన న్యాయవిచారణ మాత్రమే.
- సంఘటన జరిగిన తీరు తెన్నులు, ప్రభుత్వం స్పందించిన తీరు ఆ ప్రాంత ప్రజలు, కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందిచారు.
- మంత్రి జోగి రమేష్‌తో పాటు నేను ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి సాయం అందించాం.
- సంఘటన జరిగిన రోజు వారు ఆవేశంలో ఉన్నారు. బాధలో బయటి వ్యక్తుల ప్రమేయంతోటి తొందరపడ్డాం.. క్షమించమని కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని కోరారు.
- ఆవేశంలో చేసిన దానికి మేమేమీ పట్టించుకోవడం లేదని కూడా చెప్పాం.
- మీ కుటుంబాన్ని ఆదుకోడానికి ఒక మానవతావాదిగా ముఖ్యమంత్రి జగన్ గారు అన్నీ చేస్తున్నారని చెప్పాం.
కులం, పార్టీ రంగు పూయడం శవరాజకీయాలకు తెరలేపడమే:
- బాధిత కుటుంబానికి సాయం అందకుండా ఉండాలనే దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నది మాత్రం చంద్రబాబు, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేనే.
- జరిగిన సంఘటన ఒకటైతే దానికి కులం, పార్టీ రంగు పూయడం శవరాజకీయాలకు తెరలేపడమే.
- ప్రభుత్వం పెద్ద మనసుతో స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంటే వాళ్లు మాత్రం రాజకీయాలు చేస్తున్నారు.
- చేతనైతే ఆ కుటుంబానికి మీరు కూడా సాయం చేయండి. దాన్ని అందరూ ఆహ్వానిస్తారు.
- కానీ...బాధల్లో ఉన్న ఆ కుటుంబం బలహీనతను అడ్డం పెట్టుకుని శవరాజకీయాలకు తెరలేపడం సభ్యసమాజం తలదించుకునేలా ఉంది.
- శవాన్ని అడ్డం పెట్టుకుని స్థానిక శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్ ధర్నా చేస్తాడు.
- ఆయన ధర్నా చేసే సమయానికే ప్రభుత్వం నుంచి చేయవలసిన సంపూర్ణ సహాయంపై సానుకూల స్పందన వచ్చింది.
- వారు ధర్నా చేసే సమయానికే ముద్దాయిలను అరెస్టు చేశారు.
- వీటిలో ఎక్కడైనా అలసత్వం జరిగితే ఖచ్చితంగా మీరు ధర్నా చేయవచ్చు.
- కానీ ప్రభుత్వం పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నాక కూడా, శవాన్ని కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా ధర్నా చేశావంటే దాన్ని శవరాజకీయాలు అనక ఏమనాలి..?
ఇలాంటి కుట్రలకు కరకట్ట గెస్ట్‌హౌస్ కేంద్రంగా మారింది:
- చంద్రబాబు ఖాళీగా ఉన్నాడు...73 ఏళ్లకు పైగా వచ్చాయి...
- ఎవరు పిలుస్తారా..ఎక్కడకు వెళ్లి బట్టకాల్చి ఎవరి నెత్తిన వేసి వద్దామా అని సిద్ధంగా ఉన్నాడు.
- అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్న కృష్ణా రివర్ బెడ్‌లోని ఒక గెస్ట్ హౌస్‌లో ఉంటూ నీచమైన రాజకీయాలు చేస్తున్నాడు.
- జగన్ గారి పరిపాలనలో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కుట్రలు, కుతంత్రాలకు ఆయన కరకట్ట గెస్ట్ హౌస్ నిలయంగా మారింది.
- బాధిత కుటుంబానికి చేయవలసిన సాయం చేసిన తర్వాత నిన్న చంద్రబాబు గ్రామానికి వచ్చి నోటికొచ్చినట్లు అవాకులు చెవాకులు మాట్లాడారు.
- జరిగిన సంఘటనేంటి..? నువ్వు మాట్లాడుతున్న తీరు తెన్నులు ఏంటి..?
- చంద్రబాబు వాడిన భాషలో కానీ, మాట్లాడిన విధానంలో కానీ ఆ కుటుంబానికి భరోసా కల్పించే విధంగా ఉన్నాయా..?
- బాధలో ఉన్న ఆ కుటుంబం స్థితిగతులను అడ్డపెట్టుకుని కుల తగాదాలను రెచ్చ గొట్టి చిచ్చు పెట్టేలా ఉన్నాయి.
రిషితేశ్వరి కుటుంబ సభ్యలకు అపాయింట్ మెంటు కూడా ఇవ్వని కర్కోటకుడు బాబు:
- పరామర్శించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్ గారికి లేదా..అంటున్నాడు.
- నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నీ పక్కనే నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి హత్యకు గురైతే వారి కుటుంబాన్ని నువ్వు పరామర్శించావా..?
- ఆ కుటుంబ సభ్యులు నిన్ను కలవడానికి ప్రయత్నం చేస్తే కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు.
- అధికారుల తాట తీస్తా అంటున్న చంద్రబాబు..వనజాక్షిని జుట్టుపట్టుకుని మీ శాసనసభ్యుడు ఈడ్చుకుని వెళ్తే ఏం చేశావు..?
- బాబు ఐదేళ్ల పాలనలో రేపల్లెలో, అదే గౌడ సామాజిక వర్గ వ్యక్తులు నలుగురు చనిపోయారు.
- వారిలో నీ పార్టీ ఎంపీటీసీ హత్యకు గురైతే కనీసం పరామర్శించడానికి వచ్చావా..?
- హత్యలో ముద్దాయిల వైపు పనిచేసిన వ్యక్తి మీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్.
- అక్కడ కులం గుర్తుకు రాలేదు...కులాన్ని అక్కడ తాకట్టు పెట్టావు.
- నిన్న రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక హత్య జరిగితే దానిలో కుల ప్రస్థావన తీసుకొచ్చి రెచ్చగొట్టాలని నువ్వు చేసే ప్రయత్నం శవరాజకీయం అనక ఏమంటారు..?
- అయ్యా చంద్రబాబు...రెండు నెలల క్రితం రేపల్లెలో ఒక టీడీపీ కౌన్సిలర్ హత్యకు గురైతే ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి నువ్వుగానీ, నీ ఎమ్మెల్యే సమయాన్ని కేటాయించలేని పరిస్థితి.
- నువ్వు ఖాళీగా ఉండి..నీ పార్టీ వారినే పరామర్శించడానికి రానటువంటి కర్కోటకుడివి.
- నీకూ మాకు తేడా అదే. దాన్ని చంద్రబాబు గుర్తించాలి.
తస్మాత్ జాగ్రత్త.. నోరు అదుపులో పెట్టుకో చంద్రబాబూ..:
- బీసీ వర్గానికి చెందిన నాకు దేశంలోనే అత్యున్నత సభలో సీటు కేటాయించిన నాయకుడు జగన్ గారు.
- అదే నువ్వైతే రాజ్యసభ సీట్లను కోట్ల రూపాయలకు బేరాలు పెట్టుకుని సొమ్ము చేసుకున్న చరిత్ర నీది.
- నువ్వు నిన్న అక్కడకు వచ్చి మాట్లాడిందేంటి..?
- వచ్చిన సంఘటన ఏంటి..? నువ్వు మాట్లాడిన మాటలు, భాష ఏంటి..?
- నీ సతీమణి గురించి శాసనసభలో ప్రస్తావన రాకపోయినా..వచ్చిందని చేతకాని దద్దమ్మలా బోరుబోరున ఏడ్చిన వాడివి నువ్వు.
- నువ్వు మా ముఖ్యమంత్రిగారు, వారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేనేలేదు.
- ఇంకోసారి మా కుటుంబ సభ్యుల ప్రస్తావన తెస్తే తస్మాత్.. జాగ్రత్త.
- రాజకీయాలు రాజకీయాలుగా చెయ్..సమయం, సందర్బం లేకుండా ఇష్టారీతిన మాట్లాడతావా.?
- ఆ సంఘటనను నీ రాజకీయ పబ్బం కోసం ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కులచిచ్చు రగిలిస్తున్నావు.
- నువ్వు ఏ స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తున్నావనడానికి ఇంతకు మించిన నిదర్శనం లేదు.
- తస్మాత్ జాగ్రత్త...చంద్రబాబు..నీకు మతి భ్రమించింది...
- ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నావు.
- నోరు అదుపులో పెట్టుకోండి...లేకపోతే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు.
- ఇప్పటికే అమర్నాథ్ కుటుంబానికి సంపూర్ణ సహకారం అందించాం.
- సాధ్యమైనంత త్వరలోనే కేసులో ఉన్న వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటాం.
నీలా ప్యాకేజీకి మేం అమ్ముడుపోలేదు పవన్ కళ్యాణ్:
- పవన్‌కళ్యాణ్ కూడా చావుకు వెలకట్టి లక్ష రూపాయలు ఇచ్చారు అన్నాడు.
- నీలా ప్యాకేజీ డబ్బు మేమేం తెచ్చుకోలేదు. మా కష్టార్జితం.
- బాధిత కుటుంబం ఇబ్బందుల్లో ఉందని ఒక ప్రజాప్రతినిధిగా నా వంతు సాయంగా ఖర్చుల నిమిత్తం ఇచ్చాను.
- చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం, వైఎస్సార్సీపీ నాయకులను తిట్టడం తప్ప ఆయనకేమీ తెలియదు.
మత్స్యకారులపై నీ అవగాహన ఏంత పవన్..?:
- మత్స్యకారుల గురించి నీకు ఏం అవగాహన ఉందని మాట్లాడతున్నావు..
- టీడీపీ ఆఫీసులో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను తీసుకుని నీ ఇష్టం వచ్చిన పద్దతిలో మాట్లాడుతున్నావు.
- జగన్ గారు వచ్చిన తర్వాత తీర ప్రాంతాల్లోని మత్స్యకారులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు.
- అనువైన ప్రాంతాల్లో ఫిష్షింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నారు. దాని వల్ల మత్స్యకారుల జీవనోపాధి పెరుగనుంది.
- దశల వారీగా 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలకు మేం శ్రీకారం చుట్టాం.
- నాలుగేళ్లలోనే 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్న రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే.
- గతంలో డీజిల్ సబ్సిడీ సొమ్ము ఏడాది అయినా మత్స్యకారులకు వెళ్లేది కాదు.
- కానీ ఇప్పుడు స్పాట్‌లోనే ఆ సబ్సిడీ మత్స్యకారులకు అందిస్తున్న నాయకుడు జగన్ గారు.
- మత్స్యకారుడు వేటకు వెళ్లి చనిపోతే చంద్రబాబు రూ.4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి కూడా అతీగతీ లేదు.
- అలాంటిది జగన్‌గారు ఇప్పుడు ఆ కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నారు.
- వారిని ఆర్ధికంగా చేయూతను అందించడమే కాకుండా రాజకీయంగా కూడా ఎదిగే విధంగా చేయూతను అందించిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్.
- బీసీ వర్గాలు తలెత్తుకుని ఈ రాష్ట్రంలో తిరగగలుగుతున్నారంటే దానికి కారణం జగన్ గారే.
- ఇవన్నీ పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలి.
- చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లు రోడ్డ వెంట పడి పొర్లుదండాలు పెడుతూ ప్రజల ఆలోచనను డైవర్ట్ చేయాలంటే కుదరదు.
- జగన్ గారి పరిపాలనలో ఏవో ఘోరాలు, నేరాలు జరిగిపోతున్నాయనే గోబెల్స్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.
- జగన్ గారి పరిపాలనలో తామంతా సుఖసంతోషాలతో ఉన్నామనే అభిప్రాయంలో ప్రజలున్నారు.
- ఇవన్నీ గుర్తించి శవరాజకీయాలకు పుల్‌స్టాప్ పెట్టండి.
చంద్రబాబు మీడియా స్టేట్‌మెంట్లకే పరిమితం:
- ఎక్కడో అనుకోకుండా ఒక సంఘటన జరిగితే దాన్ని యావత్తు రాష్ట్రానికి ముడిపెట్టడం సరైన విధానం లేదు.
- చంద్రబాబు హాయంలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి..ఏ నాడు ఈ ప్రభుత్వం స్పందించినట్లు చంద్రబాబు స్పందించలేదు.
- విజయవాడలో నీ పార్టీ నాయకుడు వినోద్ జైన్ అనే వ్యక్తి మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడితే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా 15 నెలల్లోనే అతన్ని కఠినంగా శిక్షించిన చరిత్ర జగన్ గారిది.
- కానీ చంద్రబాబు హయాంలో ఎన్నో సంఘటనలు జరిగాయి..ఏ ఒక్క కేసులోనైనా ఆయన సత్వరమే స్పందిచాడా..?
- బాధ్యులకు ఒక్కరికైనా శిక్షలు వేయించిన దాఖలాలు ఉన్నాయా..?
- చాలెంజ్ చేస్తున్నాం..చూపించమనండి.
- చంద్రబాబు కేవలం మీడియా ముందు స్టేట్‌మెంట్లు ఇవ్వడానికి పరిమితం కానీ..క్రియాశూన్యం.