వైయస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన రఘురామకృష్ణ రాజు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురామకృష్ణ రాజు అన్నారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆదివారం టీడీపీని వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి వైయస్ జగన్ ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వాంచారు.
విభజన హామీల అమలు వైయస్ జగన్ వల్లే సాధ్యమన్న విశ్వాసం ప్రజల్లో ఈ సందర్భంగా మాట్లడిన రఘురామ కృష్ణ రాజు అన్నారు. తాను అభిమానించే నాయకుడు వైయస్ఆర్ అని, వైయస్ జగన్ తమ కుటుంబ మిత్రుడని ఆయన పేర్కొన్నారు. తటస్థులు సైతం వైయస్ జగన్ సీఎం కావాలని అభిలషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధన తోపాటు, ఇంకా నెరవేరని అనేక విభజన హామీలు నెరవేరాలంటే జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పాటుపడేందుకు తనవంతు కృషిగా తిరిగి సొంత ఇంటికి చేరుకున్నానని ఆయన తెలిపారు.