ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే... పల్లె నిద్ర

2 Dec, 2023 17:05 IST

చిత్తూరు:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే... పల్లె నిద్ర కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ట్లు పూతలపట్టు  శాసనసభ్యులు ఎమ్మెస్ బాబు తెలిపారు. పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎమ్మెస్  బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తలపులపల్లి గ్రామంలో పల్లెనిద్ర చేయడం చాలా సంతోషకరంగా ఉందని, ఇక్కడ   రైతుల, అలాగే ప్రజల సమస్యలు తెలుసుకున్నానని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వానికి తెలియపరచి, జిల్లా అధికారుల సైతం ప్రజల సమస్యలను తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు తలపులపల్లి బాబు రెడ్డి, మండల   కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, సచివాలయ కన్వీనర్ సుధాకర్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త పూతలపట్టు జగదీశ్వర్ రెడ్డి, కొత్తకోట  నాయకులు అమరేంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.