నిరసనాగ్రహం
తాడేపల్లి: కూటమి పాలనలో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. టీడీపీ గూండాలు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. హిందూపురంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ధ్వంసమే ఇందుకు నిదర్శనం. ‘రెడ్‌బుక్’ పాలనలో పచ్చమూకలు చెలరేగిపోతున్నా..పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. పైగా ప్రతిపక్ష పార్టీ నేతలపై నిర్బంధాలు విధిస్తూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కునూ కాలరాస్తున్నారు. ‘పురం’ వైయస్ఆర్‌సీపీ కార్యాలయంపై ఈ నెల 15న టీడీపీ అల్లరి మూకల చేసిన దాడిని నిరసిస్తూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టి, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి ఆదివారం ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పలువురు ముఖ్య నేతలు బయలుదేరారు. అయితే..వారిని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ నిర్బంధించారు. హిందూపురం పట్టణంలో ర్యాలీలు, ధర్నాలు చేయకూడదని వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ నేత వేణురెడ్డికి నోటీసులు అందించగా.. ఆయన అందుకు ఒప్పుకున్నా పార్టీ ముఖ్య నేతలను ‘పురం’లోకి అడుగుపెట్టనీయకుండా కట్టడి చేయడం ద్వారా ఖాకీలు తమ ‘వైఖరి’ని బయటపెట్టుకున్నారు. హిందూపురం బయలుదేరిన వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డిని మార్గమధ్యంలోని కదిరిలో పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా ఆయన్ను పార్టీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి స్వగృహంలో నిర్బంధించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కునూ ప్రభుత్వం కాలరాస్తోంది. కూటమి ప్రభుత్వ తీరును వైయస్ఆర్‌సీపీ నాయకులు ఎండగడుతూ ఆందోళనలు చేపట్టారు.
గుంటూరు:
హిందూపురం ఘటనకు నిరసనగా.. సోమవారం గుంటూరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఆఫీస్ దాడి కేసును రీఓపెన్ చేసి మరీ అక్రమ అరెస్టులు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూపురం వైయస్ఆర్‌సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపైనా దాడి చేశారని ఫైర్ అయ్యారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే.. ఆ కేసును రీ ఓపెన్ చేసి మరీ అమాయకులను జైలుకు పంపించారు. కేవలం మీ ఆఫీసుపై దాడి జరిగిందని వేధింపులకు దిగారు. మరి ఇప్పుడు చేస్తోంది ఏంటి? అని ప్రశ్నించారు. దాడికి నిరసనగా ఆందోళన చేసేందుకు ప్రయత్నిస్తే వైయస్ఆర్‌సీపీ నేతలను పోలీసులతో అరెస్ట్ చేయిస్తారా?.. పోలీసులు మరీ టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. డీజీపీ కూడా మేం ఫోన్లు చేస్తే స్పందించరు అంటూ ఆక్షేపించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మీద చేసింది రాజకీయ విమర్శలు. అంత మాత్రానికి దాడుల సంప్రదాయం సరికాదన్నారు. మరి గతంలో బాలకృష్ణ చేసింది ఏంటి?.. అసెంబ్లీలోనే మాజీ సీఎం వైయస్ జగన్‌ను ఆయన సైకో అనలేదా?.. నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని అవమానిస్తూ మాట్లాడలేదా?. అసెంబ్లీకి తప్పతాగొచ్చి బాలకృష్ణ మాట్లాడారు. కానీ, ఆ టైంలో ఆయన చేసింది తప్పని ఎవరూ చెప్పలేదు. ఇది న్యాయమా?.. ధర్మమా?.. బాలకృష్ణ ఎవరైనా సరే తాను చేసిన పనులకు క్షమాపణలు చెప్పాలి. అప్పటిదాకా వైయస్ఆర్‌సీపీ ఆందోళన కొనసాగిస్తుందని హెచ్చరించారు. గుంటూరు లాడ్జ్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు నూరి ఫాతిమా, దొంతి రెడ్డి వేమారెడ్డి ,అంబటి మురళి, వనమా బాల వజ్రపు బాబు తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ:
హిందూపురంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన దాడిని నిరసిస్తూ విజయవాడ నగరంలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలోని డా.బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన తెలిపి, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైయస్ఆర్‌సీపీ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు , ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ , మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు , ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ , మేయర్ రాయన భాగ్యలక్ష్మి , డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి , వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లు, పార్టీ నేతలు , కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు దేశం పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం లో రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, కూటమి ప్రభుత్వానికి కళ్లు తెరిపించి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విధంగా బుద్ధిని ప్రసాదించాలని డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని వేడుకున్నట్లు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా
హిందూపూర్ నియోజకవర్గంలో వై.యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడికి నిరసనగా ఈరోజు ఉదయం రాజమండ్రి లోని మోరంపూడి జంక్షన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద వైయస్ఆర్‌సీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు , మాజీ హోం మినిస్టర్ తానేటి వనిత ,జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ,రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జ్ గూడూరి శ్రీనివాస్ , వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు.
మదనపల్లి:
వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు హిందూపూర్ నియోజకవర్గంలో వై.యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడికి నిరసనగా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రంలో వైయస్ఆర్‌సీపీ నేతలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మదనపల్లి నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, అబ్జర్వర్ అనూష రెడ్డి , మండల కన్వీనర్ కేశవరెడ్డి , సీనియర్ నాయకులు కృష్ణా రెడ్డి తదితరులు వినతిపత్రం అందజేశారు.
ప్రకాశం జిల్లా:
ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ సోమవారం వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఆందోళన చేపట్టారు. ఒంగోలు అసెంబ్లీ ఇంచార్జ్ చుండూరి రవి ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవనం నుంచి ర్యాలీ గా వెళ్లి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ ఇంచార్జ్ చుండూరి రవి , నగర అధ్యక్షులు కటారి శంకర్ , ఒంగోలు పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శిలు కేవీ రమణ రెడ్డి , వై. వెంకటేశ్వర రావు , జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రవణమ్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్,రాష్ట్ర మహిళా కార్యదర్శి భూమి రెడ్డి రవణమ్మ, కొత్తపట్నం మండల పార్టీ అధ్యక్షులు లంకపోతు అంజిరెడ్డి, దుంపా చెంచురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా
హిందూపురంలో వైయస్ఆర్‌సీపీ కార్యాలయంపై టిడిపి గుండాల దాడిని నిరసిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ....గతంలో బిహార్ ఏవిధంగా పరిపాలన జరిగిందో ఆ విధంగా చంద్రబాబు కుటుంబం దౌర్జన్యం , దాడులు చేస్తూ రాష్ట్ర పరిపాలన సాగుతుందని మండిపడ్డారు. వీటన్నింటిపై త్వరలో రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చేప్పే రోజు వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వంగా గీతా, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ముద్రగడ గిరిబాబు , దవులూరి దొరబాబు , విపర్తి వేణుగోపాల్ , తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా
హిందూపురంలో వైయస్ఆర్‌సీపీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఏలూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్ఆర్) ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఏలూరు పట్టణంలో పాత బస్టాండ్ వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ , చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జి కంభంపాటి విజయరాజు , ఏలూరు టౌన్ అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్ , రాష్ట్ర ముదిరాజ్ విభాగ అధ్యక్షులు కోమటి విష్ణు వర్ధన్ , రాష్ట్ర యస్ సి సెల్ ప్రధాన కార్యదర్శి నుకపెయ్యి సుధీర్ బాబు , రాష్ట్ర బిసి సెల్ ప్రధాన కార్యదర్శి బలే నాగరాజు , తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల
హిందూపురంలో వైయస్ఆర్‌సీపీ కార్యాలయంపై జరిగిన దాడిని పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున తీవ్రంగా ఖండించారు. దాడికి నిరసనగా బాపట్ల పట్టణం జమ్ములపాలెం ఫ్లైఓవర్ వద్దనున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైయస్ఆర్‌సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఉపసభాపతి, పీఏసీ సభ్యుడు కోన రఘుపతి , రేపల్లె సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్, వేమూరు నియోజకవర్గం సమన్వయ కర్త వరకూటి అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా
హిందూపురంలో వైయస్ఆర్‌సీపీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ రాజంపేట అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి నేతృత్వంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు కృష్ణ రావు యాదవ్, పాపినేని విశ్వనాథ్ రెడ్డి, విశ్రాంత సబ్ కలెక్టర్ ఈశ్వరయ్య, కమలాకర్, శేఖర్ రెడ్డి,వెంకట రెడ్డి, రామ్ నగర్ శివ, బోయన పల్లి శివయ్య, దండు గోపి, బొజ్జ పెంచలయ్య, సుబ్బరాజు, సురేంద్ర, జాహీద్,జహీర్,జహీర్, మసూద్,బాలకృష్ణ, ఒబయ్యా, మున్సిపల్ కౌన్సిలర్స్ నవీన్, మునాఫ్ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు
హిందూపురంలో వైయస్ఆర్‌సీపీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ కర్నూలు నగరంలో వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని వైయస్ఆర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా
సత్యసాయి జిల్లా, హిందూపురం నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, శాసనమండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , నెల్లూరు రూరల్ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి , పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి నెల్లూరు నగరంలోని వి.ఆర్.సి.సెంటర్ వద్ద నిరసన తెలిపారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించి, వినతిపత్రం అందజేశారు.