ఎన్ని పొత్తులు పెట్టుకున్నా గెలుపు జగనన్నదే
వైయస్ఆర్ జిల్లా: ఎన్ని పొత్తులు పెట్టుకున్నా గెలుపు జగనన్నదే అని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాయమాటలతో ప్రజలను వంచించడానికే చంద్రబాబు, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైయస్.జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు ప్రపంచ రాజకీయాలకే ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమం, అభివృద్ధే పరమావధిగా జగనన్న పాలన సాగిందన్నారు. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురాలోచనతో చంద్రబాబు కూటమి ఏర్పాటు చేసుకున్నాడని మండిపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో పెత్తందారులకు కొమ్ముకాయడం తప్ప పేదలకు చేసిందేమీ లేదని ఎద్దేవాచేశారు. అందుకే ఈ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కడిగా పోటీచేసే ధైర్యం లేక జనసేన, బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాడని మండిపడ్డారు. వైయస్ఆర్ జిల్లాలో వైయస్ జగన్ చేసిన అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారన్నారు. జిల్లాలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆరోపణలకు భయపడి అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
విజయనగరం ఎంపీగా బెల్లాన నామినేషన్
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన విజయనగరం పార్లమెంట్(లోక్ సభ) అభ్యర్థి గా బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం విజయనగరం కలెక్టర్ కార్యాలయం లో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున విజయనగరం పార్లమెంట్ (లోక్ సభ)అభ్యర్థి గా బెల్లాన నామినేషన్ వేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనర్సయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనువాస రావు (చిన్నశ్రీను), శాసన మండలి సభ్యులు పెనుమత్స సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.