‘సచివాలయ’ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు
25 Jun, 2022 13:09 IST
తాడేపల్లి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు వైయస్ జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది. రెండేళ్లు పూర్తిచేసుకొని పరీక్ష ఉత్తీర్ణులైన వారందరికీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సచివాలయ ఉద్యోగులకు పే స్కేల్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీలకు పే స్కేల్ రూ. 23,120 నుంచి రూ.74,770, ఇతర సచివాలయ ఉద్యోగులకు పే స్కేల్ రూ.22,460 నుంచి రూ.72,810 ఉంటుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.