ఉల్లి ధరలను అదుపులోకి తెచ్చాం

1 Oct, 2019 14:22 IST

అమరావతి: రాష్ట్రంలో ఉల్లి సరఫరాపై పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ అధికారులు, కూరగాయల మార్కెట్‌ యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు. ఉల్లి బ్లాక్‌ మార్కెట్‌ను నివారించాలని ఆదేశించారు. ప్రజల కోసం 665 మెట్రిక్‌ టన్నుల ఉల్లి కొనుగోలు చేశామన్నారు. రైతు బజార్‌లలో కిలో ఉల్లి రూ. 25కే సరఫరా చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. విజిలెన్స్‌ దాడులతో ఉల్లి బ్లాక్‌ మార్కెట్‌ను నియంత్రించామని, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి రప్పించామన్నారు. రెండు రోజుల్లో పూర్తిగా ఉల్లి ధరలు అదుపులోకి వస్తాయని చెప్పారు.