వైయస్ జగన్ ఏపీని అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరుస్తారు
30 May, 2019 16:08 IST
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో వైయస్ జగన్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. వైయస్ జగన్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది సేపటి క్రితం రాష్ట్రపతి తన అధికారిక ట్విట్టర్ ద్వారా వైయస్ జగన్‌ను అభినందించారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను ఉన్నత శిఖరాలకు వైయస్ జగన్ చేరుస్తారని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఇప్పటికే వైయస్ జగన్ కు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అభినందనలు ట్వీటర్‌లో అభినందనలు తెలిపారు.