వైయస్ఆర్‌సీపీ కార్మిక పక్షపాత ప్రభుత్వం
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం కార్మిక పక్షపాత ప్రభుత్వమని వైయస్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ వింగ్ అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. కార్మికుల జీవితాలను బాగు చేసిన చరిత్ర వైయస్ జగన్ ది. అన్నారు. మేడే సందర్భంగా కార్మికులకు గౌతమ్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
- కార్మికుల వేతనాలు మానవతా దృక్పధంతో పెంచిన ఘనత వైయస్ జగన్ ది.వారి పిల్లలకు విద్య, కుటుంబానికి ఆరోగ్యం కోసం ఎన్నో పథకాలు అమలులోకితెచ్చారు.
- కార్మికులు ప్రమాదానికి గురైతే ఆదుకునేందుకు ప్రమాద భీమా రూ.5 లక్షలకు పెంచారు
- కార్మికులకు అన్యాయం చేసిన చరిత్ర చంద్రబాబుది.చంద్రబాబు హయాంలో ప్రభుత్వ రంగ సంస్ధలను అన్యాయంగా విక్రయించి కార్మికులను రోడ్లపాలు చేశారు
- ఈఎస్ ఐ స్కామ్ చేసి కార్మికుల సొమ్ము తిన్న అచ్చెన్నాయుడు జైలుపాలయ్యాడు.
- కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న జగన్ ప్రతి పైసా కార్మికులకే అందించారు
- పారిశుధ్య కార్మికులకు చంద్రబాబు హయాంలో రూ. 8 వేల నుండి 22 వేలకు వైయస్ జగన్ పెంచారు
- వాస్తవాలు తెలుసుకుని ఎల్లోమీడియా వార్తలు రాయాలి
- అచ్చెన్నాయుడు అరెస్టు ఎందుకయ్యారో చర్చకు రాగలరా?
- కార్మికుల సొమ్మును బొక్కింది చంద్రబాబు,అచ్చెన్నాయుడులే.
- రానున్న ఎన్నికలలో కార్మికలోకం జగన్ కు అండగా ఉండి వైయస్సార్ సిపి ఘనవిజయంలో భాగస్వామలు కాబోతున్నారు.
- పచ్చమీడియా రాతలు నమ్మే స్దితిలో ప్రజలు లేరనే విషయం పచ్చమీడియా యాజమాన్యాలు గుర్తుంచుకోవాలి.