జువ్వలదిన్నెలో పోలీసుల ఓవరాక్షన్
నెల్లూరు జిల్లా: మత్స్యకారుల సమస్యలు విని వారికి అండగా నిలిచే ఉద్దేశంతో వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నెలో ఇవాళ(బుధవారం) పర్యటించబోతున్నారు. అయితే ఈ పర్యటనకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేస్తోంది. పోలీసు వ్యవస్థను ప్రయోగిస్తోంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు బయటి నుంచి వచ్చే పడవలకూ మద్దతు ఇస్తూ స్థానిక మత్స్యకారుల పొట్టకొట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో తీవ్ర ఆందోళనలకు మత్స్యకారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంతో వాళ్లను కలిసి భరోసా ఇచ్చేందుకు వైయస్ జగన్ జువ్వలదిన్నెకు వెళ్తున్నారు. అయితే.. జగన్ రాక నేపథ్యంలో జువ్వలదిన్నె పోలీసు ఆంక్షల వలయంగా మారింది. ఫిషింగ్ హార్బర్ వైపు ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మత్స్యకారులను సైతం అటువైపు అనుమతించడం లేదు. చివరకు మీడియాకు సైతం అనుమతి లేదని చెబుతున్నారు. ఈ ఆంక్షలపై వివరణ కోరితే.. కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ ఆంక్షలు అని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఆంక్షలపై వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.