అంబటి మురళీకి మళ్లీ నోటీసులు
గుంటూరు: పొన్నూరు వైయస్ఆర్‌సీపీ ఇంఛార్జి అంబటి మురళీకి పోలీసులు మరోసారి నోటీసులిచ్చారు. మొక్కజొన్న రైతుల పరామర్శ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని నోటీసులిచ్చారు పోలీసులు.
ఇదిలా ఉంచితే, రెండు రోజుల క్రితం మామిళ్లపల్లిలో ఖాకీల దౌర్జన్యకాండ చేశారు. బుధవారం(మే 20వ తేదీ) ఉదయం రైతుల పరామర్శకు ప్రయత్నించిన వైయస్ఆర్‌సీపీ దళిత నేత జూపూడి ప్రభాకర్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మామిళ్లపల్లి రైతుల పరామర్శ కోసం జూపూడి బుధవారం ఉదయం పొన్నరూ వైయస్ఆర్‌సీపీ ఇంచార్జి అంబటి మురళి ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమాచారం అందుకున్న పోలీసులు మురళి ఇంట్లోకి దూసుకెళ్లారు. జూపూడిని బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. రైతుల పరామర్శకు వెళ్లడానికి వీల్లేదని.. అందుకు ఎలాంటి అనుమతుల్లేవని చెబుతూ పోలీసు వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అయితే మహిళలను సైతం నెట్టేసిన పోలీసులు ఆయన్ని వాహనంలోకి ఎక్కించి తరలించడంతో మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది